Priyanka Chopra : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి(S S Rjamouli)… బాహుబలి(Bahubali), త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలతో ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన సాధించిన విజయాలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటి వరకు ఆయన చేసిన 12 సినిమాలు సూపర్ ఆక్సెస్ లను సాధించాయి…ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు సైతం ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన రాజమౌళి వచ్చే నెల నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్నాడనే వార్త వినగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటివరకు మహేష్ బాబుకి పాన్ ఇండియా మార్కెట్ కూడా లేదు.
ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అయినప్పటికి డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడి సినిమా హీరోల గురించి పర్టిక్యూలర్ గా పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదనేది ఆయన గత సినిమాలను చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
ఇక ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని రాజమౌళి చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయనకు మార్కెట్ అయితే క్రియేట్ అయింది. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో కూడా పెను రికార్డ్ లను క్రియేట్ చేస్తానని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు ‘చిలుకూరి బాలాజీ టెంపుల్’ ని దర్శించుకొని నిజానికి చాలా ఎక్కువ మంది సెలబ్రిటీలు తిరుమల తిరుపతి వెళ్తూ ఉంటారు.
కానీ ఈమె మాత్రం ‘చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్’ కి వచ్చి తన భక్తిని చాటుకుంది. ఇక ఏది ఏమైనా కూడా ఆమె మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం వల్లే తనను తాను మరోసారి సౌత్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ఇలా గుళ్లను సందర్శించుకుంటూ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది…