Veera Simha Reddy 12th Day Collection: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్స్ ని దక్కించుకొని హిట్ స్టేటస్ కి చేరిన సంగతి తెలిసిందే..కానీ పండుగ సెలవలు అయిపోయిన తర్వాత ఈ మూవీ వసూళ్లు ఊహించిన దానికంటే దారుణంగా పడిపోయాయి..ముఖ్యంగా నిన్న వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే ఈ మూవీ రన్ ఇక ముగిసినట్టే అనే నిర్ధారణకు రావొచ్చు.

12 వ రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..అవతల ఈ సినిమాతో పాటు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇప్పటికీ కూడా రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంటే వీర సింహా రెడ్డి వసూళ్లు మాత్రం ఈ రేంజ్ లో పడిపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
ముఖ్యంగా కృష్ణ జిల్లాలో ఈ సినిమాకి నిన్న వచ్చిన షేర్ ‘సున్నా’..రెంటల్ బేసిస్ మీద నడుస్తున్న ఈ సినిమాకి నిన్న ప్రతీ చోట డెఫిసిట్స్ రావడం తో షేర్ రాలేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..అంతే కాదు నైజాం ప్రాంతం లో కూడా ఈ చిత్రానికి ప్రతీ థియేటర్ లో నిన్న డే డెఫిసిట్ పడింది..అయినా కూడా రిపబ్లిక్ డే ఉండడం తో థియేటర్స్ నుండి తియ్యకుండా ఇంకా ఈ సినిమాని కొనసాగిస్తున్నారు.

ఎల్లుండి షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘పఠాన్’ మూవీ విడుదల అవుతుండడం తో ఇక నైజాం ప్రాంతం లో ‘వీర సింహా రెడ్డి’ ని అన్నీ చోట్ల థియేటర్స్ నుండి తీసి వెయ్యొచ్చని అంటున్నారు విశ్లేషకులు..బాలయ్య కి కంచు కోట అని చెప్పుకునే సీడెడ్ లో కూడా ఈ సినిమాకి కేవలం నాలుగు లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..నిన్ననే ఈ రేంజ్ వసూళ్లు వస్తే, ఇక ఈరోజు నుండి అసలు ఒక్క ప్రాంతం లో కూడా షేర్ వచ్చే అవకాశం లేదంటున్నారు.