Pawan Kalyan On Kondagattu Temple: నాయకుడు జనంలో నుంచే పుట్టుకొస్తాడు.. అలా వచ్చిన వాడే నిజమైన నాయకుడవుతాడు.. మన తెలుగు ప్రజలకు అభిమానం చాలా ఎక్కువ. ఒక్కసారి అభిమానించారంటే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ప్రాంతీయ భేదం చూడరు. కుల మతాల గురించి ఆలోచించరు. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రాష్ట్రాలు, ప్రాంతీయ భేదాలు చూడకుండా.. తెలంగాణ ప్రజలు ‘కొండంత’ అభిమానం చాటుకున్నారు. కొండగట్టులో ఆయనకు చూసేందుకు వచ్చిన జనాన్ని చూస్తే.. జనమా.. జన సైన్యమా అని అనిపించక మానదు. రాజకీయంగా కాకుండా కేవలం తన ఇష్టదైవాన్ని పూజించేందుకు వచ్చిన అభిమాన నేతను చూసేందుకు భారీగా జనం తరలిరావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టులోని ఆంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. కొండగట్టులో పవన్ కళ్యాణ్ తన ప్రచార రథమైన వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. దీంతో వారాహి ఎన్నికల సమరానికి సిద్ధమైంది. పవన్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో భారీగా అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు కొండగట్టులో హంగామా చేశారు.
-జనసేన జోష్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టులో మంగళవారం విపరీతమైన రద్దీ కనిపించింది. పవన్ ఫ్యాన్స్ తమ అభిమాన నేత కోసం మంగళవారం తెల్లవారుజాము నుంచే కొండగట్టులో మకాం వేశారు. జనసేన అధినేత పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టులోనే కాకుండా ధర్మపురిలో నారసింహ యాత్రను ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ కూడా ముమ్మరంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

-గజమాలతో సత్కరించి.. పూలు చల్లుతూ..
హైదరాబాద్ నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి బయలుదేరిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు హకీంపేటలో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. రోడ్డుపై లారీ రిపేర్ కావడంతో హకీంపేట వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్‌ని క్లియర్ చేసి పవన్‌ను అక్కడి నుండి పంపించారు. ఆపై మార్గమధ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ గజమాలతో క్రేన్ సాయంతో పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ కొండగట్టుకు స్వాగతించారు. అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పలికారు.

– ఆలయంలో ప్రత్యేక పూజలు..
ఇక కొండగట్టు చేరుకున్న పవన్‌కళ్యాణ్ కు ఆలయ అర్చకులు స్వాగతం తెలిపారు. ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామికి జనసేనాని వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజాధికాలు నిర్వహించారు. తర్వాత వారాహికి ప్రత్యేక పూజలను పూర్తి చేశారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.

-జనసేన నేతలతో సమావేశం
పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు కొండగట్టుకు చేరుకున్నారు. వారాహి వాహనానికి పూజల అనంతరం పవన్ కళ్యాణ్ నాచుపల్లి సమీపంలోని కొడిమ్యాల మండల పరిధిలోని బృందావన్ రిసార్ట్ లో తెలంగాణ ప్రాంత జనసేన నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీపై దిశానిర్దేశం చేశారు. ఇక నేటి పూజల తరువాత పవన్∙కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోనుంది.
Please stay with us this time …swamy🙏❤️@PawanKalyan#JanaSenaChaloKondagattu#VarahiPoojaCeremony pic.twitter.com/gUsKCxrda1
— MR_LONELY☣️ (@vinodh_villers) January 24, 2023