https://oktelugu.com/

Bangarraju Movie: బంగార్రాజు నుంచి “వాసివాడి తస్సాదియ్యా” సాంగ్ ప్రోమో రిలీజ్… అదరగొట్టిన చిట్టి

Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాగ్ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీ రానుంది. ఈ సినిమాలో వీరికి జోడీగా రమ్యకృష్ణ, కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 08:45 PM IST
    Follow us on

    Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నాగ్ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీ రానుంది. ఈ సినిమాలో వీరికి జోడీగా రమ్యకృష్ణ, కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్… భారీ అంచనాలనే రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ లో మెరవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల్ పోస్టర్ లో నాగ్, చైతూ మధ్యన ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టింది చిట్టి.

    vasi vadi song promo released from nagarjuna bangarraju movie

    Also Read: ప్లాష్ బ్యాక్ లో నాగ్ తో రమ్యకృష్ణ.. ‘బంగార్రాజు’ ఏం చేస్తాడో ?

    ఇప్పుడు తాజాగా ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ” నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు(Bangarraju Movie).. మాకెవ్వరు కొనిస్తారు కోకా బ్లౌజు” అంటూ నాటు భాషలో.. ఊర మాస్ స్టెప్పులతో కనిపించింది. “వాసివాడి తస్సాదియ్యా.. పిల్ల జోరు అదిరిందయ్యా” అంటూ సాగిన ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటోంది. డిసెంబర్ 19 న ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సాంగ్ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా మారుతోందని మేకర్స్ తెలుపుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    https://twitter.com/AnnapurnaStdios/status/1471844495834501127?s=20

    Also Read: సమంతతో చైతన్య విడిపోడానికి కారణం ఇదేనా?.. వైరల్​గా చై రీసెంట్ ఇంటర్వ్యూ