Homeఎంటర్టైన్మెంట్Lavanya Tripathi: ఆ పుకార్ల నడుమ మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వరుణ్ వైఫ్...

Lavanya Tripathi: ఆ పుకార్ల నడుమ మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన వరుణ్ వైఫ్ లావణ్య త్రిపాఠి…!

Lavanya Tripathi: యూపీ భామ లావణ్య త్రిపాఠి.. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ట్రైయాంగిల్ లవ్ డ్రామాగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఆ చిత్రం పర్లేదు అనిపించుకుంది. లావణ్య నటనకు వంద మార్కులు పడ్డాయి. దర్శక నిర్మాతలు ఆమె పట్ల ఆసక్తి చూపారు. లావణ్య సోగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. చాలా చిత్రాలు చేసినప్పటికీ.. లావణ్యకు హిట్ పర్సంటేజ్ తక్కువ. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్,అంతరిక్షం చిత్రాల్లో లావణ్య నటించింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. లావణ్య-వరుణ్ రిలేషన్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. సదరు వార్తలను ఈ జంట ఖండించారు. కట్ చేస్తే… 2023లో నిశ్చితార్థం జరుపుకున్నారు. అదే ఏడాది నవంబర్ నెలలో ఇటలీ వేదికగా వరుణ్ తో లావణ్య వివాహం జరిగింది. పెళ్ళై ఏడాది దాటిపోయింది. లావణ్య తల్లి అయ్యారంటూ పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లలో నిజం లేదని తేలిపోయింది.

వివాహం అనంతరం నటనకు దూరంగా ఉంటున్న లావణ్య త్రిపాఠి.. కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది. సతీ లీలావతి టైటిల్ తో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తుంది. ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. లావణ్యకు జంటగా శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ నటిస్తున్నాడు. సతీ లీలావతి చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు షాక్ కి లావణ్య పై వరుణ్ తేజ్ క్లాప్ కొట్టాడు . లావణ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో.. ఆమె తల్లి అయ్యారన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

ఆమె నటిగా కొనసాగాలని డిసైడ్ అయ్యారని స్పష్టం అవుతుంది. మారిన సమీకరణాల రీత్యా వివాహం అనంతరం కూడా హీరోయిన్స్ నటన కొనసాగిస్తున్నారు. నార్త్ భామలు అయితే గ్లామరస్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో వదిన లావణ్యను సప్పోర్ట్ చేస్తూ.. నిహారిక.. పెళ్ళికి, వృత్తికి ముడిపెట్టడం ఏంటి?.. వివాహం అనంతరం నటిస్తే తప్పేంటి..? అన్నారు. ఈ విషయంలో లావణ్యకు మెగా ఫ్యామిలీ మద్దతుగా గట్టిగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. ఆయనకు హ్యాట్రిక్ ప్లాప్స్ పడ్డాయి.

RELATED ARTICLES

Most Popular