Sukumar: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన తనకంటూ ఒక శైలి క్రియేట్ చేసుకున్నారు. సుకుమార్ డెబ్యూ మూవీ ఆర్య.. లవ్ జానర్ లో ట్రెండ్ సెట్టర్ అనొచ్చు. ట్రైయాంగిల్ లవ్ డ్రామాను, వన్ సైడ్ లవ్ నేపథ్యంలో కొత్తగా చెప్పాడు. ఆర్య హీరో అల్లు అర్జున్ కి లైఫ్ ఇచ్చిన చిత్రం అనడంలో సందేహం లేదు. మహేష్ బాబుతో సుకుమార్ చేసిన వన్ నేనొక్కడినే మంచి సినిమా. ఉన్నతమైన నిర్మాణ విలువలతో హాలీవుడ్ రేంజ్ లో వన్ నేనొక్కడినే తెరకెక్కించారు.
సైకలాజికల్ థ్రిల్లర్ కావడంతో మన ఆడియన్స్ కి ఎక్కలేదు. ప్రేక్షకుల నాడి తెలుసుకుని.. వాళ్ళ అభిరుచి ఆధారంగా తెరకెక్కిస్తేనే.. సక్సెస్ దొరుకుంటుందని తెలుసుకున్న సుకుమార్ రంగస్థలం చేశారు. సుకుమార్ గత చిత్రాలకు పూర్తి భిన్నమైన జానర్ లో రంగస్థలం తెరకెక్కింది. వింటేజ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు.
ఇక పుష్ప సిరీస్ తో సుకుమార్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ పాపులారిటీ రాబట్టాడు. 2024 డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2.. ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టింది. ముఖ్యంగా హిందీలో పుష్ప 2 నెలకొల్పిన రికార్డులు ఇప్పట్లో చెరపలేనివి. సుకుమార్ దర్శకత్వ ప్రతిభను అందరూ కొనియాడుతున్నారు. అయితే సుకుమార్… పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం పూరి జగన్నాధ్ ని కలిశాడట.
బద్రి, ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి, శివమణి వంటి హిట్ చిత్రాలతో పూరి జగన్నాధ్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. పూరికి తెలిసిన ఓ వ్యక్తి సుకుమార్ కి తెలుసు అట. ఆయన రికమెండ్ చేయడంతో పూరి జగన్నాద్ ని సుకుమార్ కలిశాడట. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన వద్ద ఛాన్స్ ఇవ్వాలని అడిగాడట. అప్పుడు సుకుమార్ ని పూరి ఒక కథ చెప్పమని అడిగాడట. ఈ విషయాన్ని లైగర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్-పూరి ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు. అప్పుడు సుకుమార్ బయటపెట్టాడు. సుకుమార్ తన వద్దకు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వచ్చిన విషయం పూరికి గుర్తు లేదు.