Sridevi Drama Company
Sridevi Drama Company: వైజాగ్ భామ రష్మీ గౌతమ్ తెలుగు బుల్లితెర టాప్ యాంకర్స్ లో ఒకరు. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్.. ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేసింది. బ్రేక్ రాకపోవడంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ షో ఆమె ఫేట్ మార్చేసింది. వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్ షో నుండి తప్పుకున్నారు. ఆమె స్థానంలో రష్మీ వచ్చింది. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కావడంతో రష్మీ విపరీతమైన పాపులారిటీ రాబట్టింది.
రష్మీ గ్లామర్ జబర్దస్త్ షోకి మరో ఆకర్షణ అనడంలో సందేహం లేదు. స్టార్ యాంకర్ ఇమేజ్ రష్మీకి హీరోయిన్ ఆఫర్స్ తెచ్చిపెట్టింది. జయాపజయాలతో సంబంధం లేకుండా పలు చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించింది. కాగా రష్మీ వయసు 35 ఏళ్ళు దాటిపోయింది. అయినప్పటికీ ఆమె పెళ్లి మాట ఎత్తడం లేదు. జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ తో రష్మీ ఏళ్ల తరబడి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. బుల్లితెర ప్రేక్షకుల్లో రష్మీ-సుధీర్ ల జంటకు విపరీతమైన క్రేజ్ ఉంది. వారు నిజమైన ప్రేమికులే అని అభిమానులు నమ్ముతారు.
రష్మీతో పాటు సుధీర్ కూడా వివాహం చేసుకోవడం లేదు. ఇక సుధీర్ తో నీకున్న బంధం ఏంటని అడిగితే… బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటుంది. స్నేహానికి మించిన అనుబంధం మా మధ్య లేదని రష్మీ సమాధానం చెబుతుంది. కాగా లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో రష్మీ తన ప్రియుడు ఎవరో తేల్చేసింది. అతని పేరు బోర్డు పై రాసింది. వాలెంటైన్స్ డే మంత్ ని పురస్కరించుకుని.. ప్రేమ ప్రధాన కాన్సెప్ట్ గా ఎపిసోడ్ రూపొందించారు.
కమెడియన్ నూకరాజు.. బోర్డు మీద పేర్లు రాసి.. వాళ్ళ రిలేషన్ ఏమిటో చెప్పేస్తా.. అంటూ.. రష్మీ పేరు రాశాడు. అప్పుడు కల్పించుకున్న రష్మీ.. నా ప్రియుడి పేరు నేను రాస్తా అంటూ… లేచి వేదిక మీదకు వెళ్ళింది. బోర్డు పై ఎస్ అనే లెటర్ రాసింది. జడ్జి ఇంద్రజ.. పేరు రాయడానికి ప్లేస్ సరిపోదేమో.. అన్నారు. సుడిగాలి సుధీర్ కొంచెం పెద్ద పేరు కాబట్టి.. ఆ సెన్స్ లో ఇంద్రజ అన్నారు. ఎస్ లెటర్ రాసిన రష్మీ.. ఎవరి పేరు రాసిందో పూర్తిగా చూపించలేదు.
అది సుడిగాలి సుధీర్ పేరే అని నెటిజన్స్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రోమో చూసిన జనాలు ఒకింత మండిపడుతున్నారు. ఇలాంటి టీఆర్పీ స్టంట్స్ చాలానే చూశాం. జనాలను పిచ్చోళ్లను చేయడం ఆపండి అని కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా రష్మీ తన లవర్ ఎవరో తెలియజేసిందా లేదా? అనే విషయం పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయితే కానీ స్పష్టత రాదు.
Web Title: Sridevi drama company latest promo 09 feb
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com