Matka on OTT : విభిన్నమైన చిత్రాలు అందించడంలో వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త సబ్జెక్టులు ఎంచుకుంటారు. అయితే విజయాలు కూడా అందుకున్నప్పుడే ప్రయోగాలకు విలువ ఉంటుంది. కెరీర్ ముందుకు సాగుతుంది. వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఆయన మార్కెట్ భారీగా దెబ్బ తిన్న సూచనలు కనిపిస్తున్నాయి. వరుసగా మూడో ప్లాప్ మట్కా రూపంలో ఆయనకు ఎదురైంది. మట్కా వరుణ్ తేజ్ కెరీర్ లోయస్ట్ వసూళ్లు నమోదు చేసింది.
దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించారు. ఫస్ట్ షో నుండే మట్కా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఓపెనింగ్స్ కూడా రాలేదు. మట్కా రన్ కేవలం రూ. 1 కోటితో ముగిసేలా ఉంది. రెండో రోజే థియేటర్స్ నుండి కొన్ని ఏరియాల్లో తీసేశారు. దీన్ని లక్కీ భాస్కర్, అమరన్, కొంత మేర క చిత్రాలు క్యాష్ చేసుకున్నాయి. కంగువా చిత్రానికి సైతం నెగిటివ్ టాక్ రావడం ఆ మూడు చిత్రాలకు ప్లస్ అయ్యింది.
మట్కా పరాజయం నేపథ్యంలో అనుకున్న సమయానికి ముందే ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. పాన్ ఇండియా మూవీగా విడుదల చేయగా.. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు రూ. 15 కోట్లకు కొనుగోలు చేశారట. ఇక మట్కా చిత్రం నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో స్ట్రీమ్ కానుందని సమాచారం అందుతుంది.
కాగా మట్కా పీరియాడిక్ క్రైమ్ డ్రామా. మట్కా కింగ్ రతన్ ఖేత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. వైజాగ్ కి వలస వచ్చిన వాసు అనే వ్యక్తి మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు? నేర సామ్రాజ్యం ఎలా స్థాపించాడు? అని చూపించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సినిమా ఎలా ఉన్నా.. వరుణ్ తేజ్ నటనకు మార్క్స్ పడ్డాయి.