దీపావళికి ముహూర్తం ఫిక్స్ చేసిన వరుణ్ తేజ్ !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ సినిమాని ఆల్ రెడీ పూర్తి చేసాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ డేట్ ను రివీల్ చేస్తూ పోస్టర్‌ ను విడుదల చేశారు మేకర్స్. బాక్సింగ్ కోట్ లో కండల తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. ఇక ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ […]

Written By: admin, Updated On : August 5, 2021 6:14 pm
Follow us on

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ సినిమాని ఆల్ రెడీ పూర్తి చేసాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ డేట్ ను రివీల్ చేస్తూ పోస్టర్‌ ను విడుదల చేశారు మేకర్స్. బాక్సింగ్ కోట్ లో కండల తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు.

ఇక ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. పైగా ఈ సినిమా కోసం కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. మొదటిసారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు. అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గతంలో బాలు సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’నే వరుణ్ తేజ్ తన సినిమాకి టైటిల్ గా పెట్టుకోవడం విశేషం.

గతంలో పవన్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ తో హిట్టు కొట్టిన వరుణ్ ఇప్పుడు గనితో హిట్ కొడతాడేమో చూడాలి. కాగా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై అల్లు వెంకటేశ్, సిద్దు నిర్మిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ పెట్టాలి.

కానీ, కరోనా కారణంగా వెనుకబడింది. అయితే, తాజాగా దీపావళి స్పెషల్ గా ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అన్నట్టు ఈ సినిమా కోసం వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు.