https://oktelugu.com/

ఎన్టీఆర్-ఉప్పెన డైరెక్టర్ అప్పుడే ఊపేస్తారట!

ఉప్పెన సినిమాతో ఒకసరికొత్త కథను ఎంచుకొని దాన్ని ప్రేక్షకులను మెప్పించే తీసిన సుకుమారు శిష్యుడు బుచ్చిబాబు ఈ కరోనా లాక్ డౌన్ టైంలో రాసుకున్న కథ పట్టాలెక్కే రోజువచ్చింది. ఉప్పెన మూవీ తర్వాత మరో సినిమా తీయని ఈ బుచ్చిబాబు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఓ మాంచి కథను రెడీ చేసుకొని ఉన్నాడు. ఆ కథ ఇటీవలే ఎన్టీఆర్ కు వినిపించగా ఓకే అన్నాడని తెలిసింది. కథ బాగా నచ్చిందని చేద్దామని హామీ ఇచ్చాడట.. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 5, 2021 / 06:06 PM IST
    Follow us on

    ఉప్పెన సినిమాతో ఒకసరికొత్త కథను ఎంచుకొని దాన్ని ప్రేక్షకులను మెప్పించే తీసిన సుకుమారు శిష్యుడు బుచ్చిబాబు ఈ కరోనా లాక్ డౌన్ టైంలో రాసుకున్న కథ పట్టాలెక్కే రోజువచ్చింది. ఉప్పెన మూవీ తర్వాత మరో సినిమా తీయని ఈ బుచ్చిబాబు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఓ మాంచి కథను రెడీ చేసుకొని ఉన్నాడు. ఆ కథ ఇటీవలే ఎన్టీఆర్ కు వినిపించగా ఓకే అన్నాడని తెలిసింది. కథ బాగా నచ్చిందని చేద్దామని హామీ ఇచ్చాడట..

    ఎన్టీఆర్ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామాను బుచ్చిబాబు రాసుకున్నాడు. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉండడంతో బుచ్చిబాబు సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. అయితే బుచ్చిబాబు నిరుత్సాహ పడకుండా ఈ గ్యాప్ లో మరో సినిమాను తీసే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

    అయితే మంచి కథకావడంతో బుచ్చిబాబుకు ఎన్టీఆర్ డేట్స్ సర్దుబాటు చేసినట్టు తెలిసింది. 2022 జులై నుంచి సినిమా మొదలుపెడుదామని.. ఏర్పాట్లు చేసుకోవాలని తాజాగా ఎన్టీఆర్ స్వయంగా బుచ్చిబాబుకు చెప్పినట్టు తెలిసింది.

    ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు. అది పూర్తయ్యాక బుచ్చిబాబు సినిమా చేయనున్నాడు. 2022లో ఎన్టీఆర్-బుచ్చిబాబు కాంబినేషన్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని సైతం మైత్రీ మూవీస్ నిర్మించబోతోంది. ఇప్పటికే ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీని ఊపేసిన బుచ్చిబాబు ఇప్పుడు ఎన్టీఆర్ తో పిరియాడిక్ డ్రామా కథతో ఎలా ఊపేస్తాడన్నది వేచిచూడాలి.