Movies Clash: క్రిస్మస్ టాలీవుడ్ కి మంచి సీజనే. ఒక విధంగా దీపావళి కంటే క్రిస్మసే టాలీవుడ్ కి ఎక్కువ కలిసి వస్తోంది. అయితే, ఈ క్రిస్మస్ కి సోలోగా వచ్చి పండగ చేసుకుందామని ఆశ పడ్డాడు నాని. సోలో రిలీజ్ ఉంటే.. ఓపెనింగ్స్ బాగుంటాయి. పైగా అంచనాలు ఉన్న సినిమా కాబట్టి.. లాంగ్ టైంలో కూడా కలెక్షన్స్ వస్తాయి. అందుకే, మొదటి నుంచి నాని క్రిస్మస్ సెలవులను తనే క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

అదృష్టం బాగుండి.. అఖండ ముందే వచ్చేస్తోంది. ఇక పుష్ప సైతం ముందే వచ్చేస్తోంది. ఇక నానికి బాగా కలిసి వస్తోంది అనుకున్నారు. కానీ అనుకున్నట్లు జరిగితే అది సినిమా రిలీజ్ ఎందుకు అవుతుంది. నాని వేసిన ప్లాన్ వర్క్ అవుట్ కావట్లేదు. ఇప్పుడు నానికి పోటీగా వరుణ్ తేజ్ దిగుతున్నాడు. ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడ్డ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా ‘గని’ ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధం అయింది.
డిసెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కూడా డిసెంబర్ 24నే విడుదల అవుతుంది. మొత్తానికి ఈ క్రిస్మస్ కి నానితో, వరుణ్ తేజ్ గట్టిగానే పోటీకి దిగుతున్నాడు. ఇప్పటికే నాని తన సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేశాడు. తాజాగా వరుణ్ తేజ్ తన ‘గని’ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశాడు.
Also Read: అభిమానులకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన నాని… శ్యామ్ సింగరాయ్ టీజర్ ఎప్పుడంటే ?
టీజర్ లో మ్యాటర్ ఉంది. ‘శ్యామ్ సింగ రాయ్’ కంటే బెటర్ సినిమా అనే పేరును తెచ్చుకుంది. పైగా గని ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ దిగబోతున్నాడు. అలాగే గని ట్రైలర్ ను మెగాస్టార్ రిలీజ్ చేస్తాడట. ఏ రకంగా చూసుకున్నా వరుణ్ తేజ్ సినిమా జనంలోకి పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ లెక్కన నాని తన సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంది.
Also Read: గని సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్రల పాత్రలు ఇవే.. టీజర్ ఎప్పుడంటే!
ఇవన్నీ నాని ముందే ఉహించాడు. అందుకే చాలా ముందుగానే క్రిస్మస్ కి తన సినిమా వస్తుందని అధికారికంగా ఎనౌన్స్ చేయించాడు. అయినా పోటీ తప్పేలా లేదు. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు పోటీ కారణంగా ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం ఉంది.