https://oktelugu.com/

Lavanya Tripathi: మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు, తల్లైన వరుణ్ వైఫ్ లావణ్య… సంచలన వీడియో వైరల్

మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు వచ్చేస్తున్నాడు. వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి అయ్యారు. బేబీ బంప్ తో ఉన్న లావణ్య త్రిపాఠి ఫోటోలు లీక్ అయ్యాయి. దాంతో ఈ విషయంపై స్పష్టత వచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 9, 2024 / 09:38 AM IST

    Lavanya Tripathi

    Follow us on

    Lavanya Tripathi: మెగా ఫ్యామిలీలో వరుస వేడుకలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టాడు. అలాగే నిహారిక నిర్మాతగా మారి విజయం అందుకుంది. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఇదంతా క్లిన్ కార వలనే అని మెగా ఫ్యామిలీ భావిస్తుంది. క్లిన్ కార ఉపాసన కడుపులో పడ్డప్పటి నుండే మెగా ఫ్యామిలీలో మంచి విషయాలు మొదలయ్యాయి.

    ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు వస్తున్నాడు. హీరో వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నాడు. వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గర్భం దాల్చారు. బేబీ బంప్ తో ఉన్న లావణ్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుణ్ తేజ్ తో పాటు వెకేషన్ కి వెళ్లిన లావణ్య త్రిపాఠి మోడ్రన్ డ్రెస్ ధరించారు. ఆ డ్రెస్ లో లావణ్య బేబి బంప్ స్పష్టంగా కనిపించింది. దాంతో లావణ్య గర్భవతి అన్న విషయం పై స్పష్టత వచ్చింది.

    ఆ మధ్య లావణ్య తల్లి అయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. సదరు కథనాలకు లావణ్య లేటెస్ట్ లుక్ బలం చేకూర్చింది. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. 2023 నవంబర్ నెలలో లావణ్య-వరుణ్ తేజ్ ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్రముఖులు వరుణ్-లావణ్యల వెడ్డింగ్ రిసెప్షన్ లో హాజరయ్యారు.

    చాలా కాలం వరుణ్-లావణ్య రహస్యంగా ప్రేమించుకున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడు మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. వివాహం అనంతరం లావణ్య నటనకు గుడ్ బై చెప్పింది. మిస్ పర్ఫెక్ట్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. తర్వాత లావణ్య నటించలేదు. ఆమె గృహిణిగా మారిపోయారు.

    పెళ్ళైన ఏడాదిలోపే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా కొనసాగుతున్నారు. మట్కా టైటిల్ తో వరుణ్ తేజ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ గత చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆయన ఒక సాలిడ్ కమ్ బ్యాక్ కోసం వేచి చూస్తున్నారు.