Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్ట పడ్డాడు. అంత కష్టపడి సినిమా చేశాడు కాబట్టి.. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నాడు.

కాగా తాజాగా ఆ ప్రమోషన్స్ లో పలు ఆసక్తి కరమైన కామెంట్స్ చేశాడు వరుణ్ తేజ్. ముందుగా వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందిస్తూ.. ‘నాకు నితిన్, సాయి ధరమ్ తేజ్ క్లోజ్. వాళ్లతో నేను చాలా సన్నిహితంగా ఉంటాను. కాబట్టి.. వారితో మల్టీస్టారర్‌లు చేయడానికి నేను ఇష్టపడతాను’ అని చెప్పుకొచ్చాడు. మరి వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి.
అలాగే వరుణ్ తేజ్ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి నేను ఫిట్ గా ఉండను. కానీ ‘గని’ సినిమాలో కోచ్‌గా నటించిన సునీల్‌శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కి వెళ్లి ఫిట్ గా మారాను. ఇక మా బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ ను సెట్ చేశారు. మేము ఆయనను ఫాలో అవుతున్నాము’ అంటూ వరుణ్ తేజ్ చెప్పాడు. తమ్ముడు సినిమా తనను ఎంతో ప్రభావితం చేసిందని కూడా వరుణ్ చెప్పాడు.
ఇక గని మూవీ రిలీజ్‌కి ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్.. డైరెక్టర్, హీరోని పొగడ్తలతో ముంచెత్తారు. బన్నీ మాట్లాడుతూ.. ‘వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. సిక్స్ ప్యాక్ తో కనిపించిన వరుణ్ నటన చాలా గొప్పగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో నటించడానికి వరుణ్ తేజ్ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.