https://oktelugu.com/

Natti kumar Sensational Comments On RGV: మోసం చేశావయ్యా అంటే.. ఇది ఆ కథ అంటున్నాడు !

Natti kumar Sensational Comments On RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బర్త్ డే నేడు. కానీ ఆయనకు పుట్టిన రోజు నాడే షాక్ తగిలింది. తనకు ఇవ్వాల్సిన రూ.5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా ఆర్జీవీ తప్పించుకుంటున్నాడని.. నిర్మాత నట్టి కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నట్టి కుమార్ తో గతంలో వర్మ కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఆ సినిమాలు ఏవీ ఆడలేదు. మరి వీరిద్దరూ మధ్య ఏ ఒప్పందం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 7, 2022 / 06:41 PM IST
    Follow us on

    Natti kumar Sensational Comments On RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బర్త్ డే నేడు. కానీ ఆయనకు పుట్టిన రోజు నాడే షాక్ తగిలింది. తనకు ఇవ్వాల్సిన రూ.5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా ఆర్జీవీ తప్పించుకుంటున్నాడని.. నిర్మాత నట్టి కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నట్టి కుమార్ తో గతంలో వర్మ కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఆ సినిమాలు ఏవీ ఆడలేదు. మరి వీరిద్దరూ మధ్య ఏ ఒప్పందం జరిగిందో తెలియదు.

    Natti kumar Sensational Comments On RGV

    వర్మ ప్రతి సినిమాకు నట్టి కుమార్ కి రూ.50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నాయట. ఇప్పుడు ఆ నిబంధనలు పాటించడం లేదని నట్టి కుమార్ ఆరోపించారు. దీంతో ఆర్జీవీ తాజా చిత్రం ‘మా ఇష్టం’ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘మా ఇష్టం డేంజరస్’ మూవీ వాయిదా పడింది.

    ఈ సినిమా ఏదో పెద్ద భారీ అంచనాలతో ఏమి రిలీజ్ కావడం లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అయినా జనం చూస్తారనే నమ్మకం వర్మకు కూడా లేదు. ఇలాంటి సినిమా కోసం మళ్లీ వివాదాలు ఒక్కటి. ఇంతకీ ఈ సినిమా కథ ఏమిటో తెలుసా ?ఇద్దరు అమ్మాయిలు ప్రేమ కథ. అందుకే.. ఈ విషయాన్ని వర్మనే స్వయంగా చెబుతూ.. లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన విడుదల చేయడానికి థియేటర్ల వారు సహకరించని కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆర్జీవీ ఒక ట్వీట్ పెట్టాడు.

    పైగా అన్ని విధాలుగా ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కొవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తర్వాత మరో విడుదల తేదీ తెలియజేస్తానని ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరి, వర్మ మాత్రం నట్టి కుమార్ సంగతి.. నట్టి కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి చెప్పలేదు. ఏమిటో వర్మ.. ఎలా ఉండాల్సిన వాడు ఎలా అయిపోయాడు.

    Ram Gopal Varma

    అసలు మోసం చేశావయ్యా అంటూ నట్టి కుమార్ వర్మను అడుగుతుంటే.. వర్మ మాత్రం థియేటర్ల వారు సహకరించడం లేదు అంటున్నాడు. ఇలా ఉంది వర్మ పరిస్థితి. అన్నట్టు రామ్ గోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా.. సినీ గేయ రచయిత సిరా శ్రీ.. వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవీపై ఓ పద్యం రాస్తూ.. రాకెట్టుగా దూసుకెళ్లు రాముండితడే అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘బాగానే ఉంది.. కానీ, తనను రావణుడితోనే పోల్చితేనే తనకు మరింత సంతృప్తిగా ఉంటుంది’ అని పోస్ట్ చేయడం విశేషం.

    Tags