https://oktelugu.com/

‘పవర్ స్టార్’ను మళ్ళీ వాడుకున్న వరుణ్ తేజ్ !

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాక్సర్ సినిమాని ఆల్ రెడీ పూర్తి చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ‘గని’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఆ విషయాన్ని రివీల్‌ చేశారు. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గతంలో బాలు సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’ని టైటిల్ గా ఫిక్స్ […]

Written By:
  • admin
  • , Updated On : January 19, 2021 / 11:49 AM IST
    Follow us on


    మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బాక్సర్ సినిమాని ఆల్ రెడీ పూర్తి చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ‘గని’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఆ విషయాన్ని రివీల్‌ చేశారు. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గతంలో బాలు సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’ని టైటిల్ గా ఫిక్స్ చేశారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై అల్లు వెంకటేశ్, సిద్దు నిర్మిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు.

    Also Read: ప్రభాస్ ‘ఆది పురుష్’.. ఇండియాలో ఇదే తొలిసారి !

    నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాలి, కానీ కరోనా కారణంగా వెనుకబడింది. దానికి తోడు వరుణ్ తేజ్ తన చెల్లి నీహారిక పెళ్లి కోసం దాదాపు నెల రోజులు పాటు ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోలేదు. ఆ కారణంగా కూడా ఈ సినిమా కొంత ఆలస్యం అయింది. ఇక నిహారిక పెళ్లి తరువాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న వరుణ్, మొత్తానికి F3 సినిమాతో సెట్స్ పైకి వచ్చాడు. అలాగే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ ను కూడా త్వరగా పూర్తి చేస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమా కోసం వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు.

    Also Read: పవర్ స్టార్ ఈ నెల 24 నుండి.. !

    ఇక వరుణ్ తేజ్ మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడుకునే ఆలోచనలో గని అని తన సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడు. గతంలో తొలిప్రేమ టైటిల్ తో హిట్టు కొట్టిన వరుణ్ ఇప్పుడు అదే తరహాలో మరో సినిమాలోని పవన్ పేరును వాడుకుని హిట్ కొడతాడేమో చూడాలి. ఇక లోఫర్, వాల్మీకి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ ట్రయ్ చేసిన వరుణ్ ఈ సినిమాలో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్