ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్లకు ఏదోరకంగా న్యాయం చేస్తారని టాక్ ఏపీలో ఉంది. జగన్ తొలి నుంచి ఇదే ఫార్మూలాను ఫాలో అవుతూ ముందుకెళుతున్నాడు. దీంతోనే జగన్ పై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన ఆయన వెంటే నడిచేందుకే ఆయన అనుచరులు.. అధికారులు ఇష్టపడుతుంటారనే టాక్ ఉంది.
Also Read: చరిత్రను మరిచి చిన్న జీయర్ వ్యాఖ్యలు
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తనను నమ్ముకున్న వాళ్లందరికీ పెద్దపీఠవేసి పదవులు కట్టబెట్టారు. అంతేకాకుండా జగన్మోరెడ్డి అక్రమాస్తుల కేసులో తనతోపాటు జైలు జీవితం అనుభవించిన అధికారులకు సైతం ప్రమోషన్లు కల్పిస్తున్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్ గుప్తా సైతం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉన్నవారే. ప్రస్తుతం ఆ లిస్టులో మరొకరు చేరారు.
అత్యంత చిన్న వయస్సులో శ్రీలక్ష్మీ ఐఏఎస్ గా నియామకం అయ్యారు. ఆమెపై అవినీతి ఆరోపణలు.. జైలు జీవితం వంటి సంఘటనలు లేకుంటే శ్రీలక్ష్మీ ఇప్పటికే సీఎస్ హోదాలో బాధ్యతలు నిర్వహించేవారు. కానీ ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో కొన్నేళ్లు జైలు జీవితం గడిపారు. శ్రీలక్ష్మికి బెయిల్ వచ్చాక తెలంగాణలో ఆమె ప్రాధాన్యం ఉన్న పోస్టింగ్ దక్కలేదు.
ఈక్రమంలోనే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆమెకు తిరిగి ఉత్సాహం దక్కింది. తెలంగాణలో ఏడాదిన్నర విధులు నిర్వహించకుండా క్యాడర్ మార్పించుకొని ఏపీలో పోస్టింగ్ దక్కించుకున్నారు. ఆమె ఏపీకి వచ్చి నెలరోజులు పూర్తవకుండానే జగన్ సర్కార్ శ్రీలక్ష్మికి బంపరాఫర్ ఇచ్చింది.
Also Read: సీఎం మార్పు ‘ముందస్తు’ వ్యూహమేనా?
శ్రీలక్ష్మీ ప్రస్తుతం కార్యదర్శి ర్యాంక్ పదవీలో కొనసాగుతుండగా ఏపీ సర్కార్ ఆమెకు ముఖ్య కార్యదర్శి పదవీని కట్టబెట్టింది. ఈమేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఆమె మీదున్న పెండింగ్ కేసుల తీర్పులు.. డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుంతుందని.. తుదితీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని సీఎస్ వివరణ ఇవ్వడం గమనార్హం
సీఎస్ ముందస్తుగా వివరణ ఇవ్వడం ద్వారా ఆయనపై ఎలాంటి నిందలు పడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే శ్రీలక్ష్మికి ప్రమోషన్ ఇవ్వడం చెల్లుతుందా? లేదా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా జగన్మోహన్ రెడ్డి తన సహచార నిందుతులందరికీ కీలక పదవులు కట్టబెడుతుండటం విశేషం. అయితే ఇవన్నీ కూడా జగన్ కు మరిన్ని న్యాయచిక్కులు తీసుకొచ్చేలా కన్పిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్