https://oktelugu.com/

Varuntej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైలైట్స్.. పవన్ కళ్యాణ్ మిస్సింగ్!

బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం లో ఒక్క రామ్ చరణ్ నిశ్చితార్థం కి తప్ప, మిగతా ఎవ్వరి నిశ్చితార్థం కి కూడా హాజరైనట్టు దాఖలాలు లేవు. నిహారిక నిశ్చితార్థం కి కూడా ఆయన హాజరు కాలేదు.

Written By: , Updated On : June 9, 2023 / 10:28 PM IST
Follow us on

Varuntej – Lavanya Tripathi : మెగా అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక దగ్గరకి వచ్చేసింది. నేడు హైదరాబాద్ లోని నాగబాబు నివాసం లో వీళ్లిద్దరి నిశ్చతార్థం జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవ్వగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తన అన్నయ్య కొడుకు నిశ్చితార్ధ వేడుకకు హైదరాబాద్ లో ఉండి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నా #OG మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. నేడు కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది, రాత్రి పూట కూడా షూటింగ్ ఉండడం తో పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయియుండొచ్చు అని అంటున్నారు.

బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం లో ఒక్క రామ్ చరణ్ నిశ్చితార్థం కి తప్ప, మిగతా ఎవ్వరి నిశ్చితార్థం కి కూడా హాజరైనట్టు దాఖలాలు లేవు. నిహారిక నిశ్చితార్థం కి కూడా ఆయన హాజరు కాలేదు. దీనిని బట్టీ పవన్ కళ్యాణ్ ఏమైనా సెంటిమెంట్ ఉందా ? అనే సందేహాలు తెలెత్తాయి.

ఇక పోతే ఈ నిశ్చితార్ధ వేడుకకు కేవలం మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు ఒక్కరు కూడా రాలేదు , మీడియా కి లోపలకు ప్రవేశం లేదు కనుక, బయట నుండి కెమెరాలతో లోపలకు కార్స్ లో మెగా హీరోలు వెళ్తుండడం ని వీడియోస్ షూట్ చేసారు. రామ్ చరణ్ , అల్లు అర్జున్ , చిరంజీవి , సాయి ధరమ్ తేజ్ , పంజా వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ ఈ నిశ్చితార్ధ వేడుకకు హాజరయ్యారు.