Korean Kanakaraju Movie Story: ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తనకంటూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ… ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు అతనికి పెద్దగా సక్సెసులనైతే తీసుకురాలేకపోయాయి. దాంతో మరోసారి డిఫరెంట్ గా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో వరుణ్ తేజ్ ను హీరోగా పెట్టి ‘కొరియన్ కనకరాజ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే కావడంతో గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశాడు. గ్లింప్స్ లో రక్తపాతం చూపిస్తూ వరుణ్ తేజ్ ను చాలా డిఫరెంట్ గా ప్రెసెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక కనకరాజ్ క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ నటించినప్పటికి కొరియన్ కనకరాజ్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ గా తెలుస్తుంది… ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
వరుణ్ తేజ్, సత్య ఇద్దరు కలిసి కొరియా వెళ్లి అక్కడ కొన్ని బిజినెస్ పనులను చూసుకుంటారు. అక్కడ కనకరాజుకి కొంతమందితో గొడవలు ఏర్పడతాయి. దాంతో కనకరాజు కోసం కొరియన్ పోలీసులు వెతుకుతుంటారు.దాంతో అతన్ని పట్టుకోడానికి కొరియన్ పోలీసులు సిటీ మొత్తం గాలిస్తూ ఉంటారు.
ఇక ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ పోలీసులను ఎదిరించి అక్కడ ఎలా నిలబడగలిగాడు. అలాగే తను చేసిన దాంట్లో తప్పు లేదని తనను తాను ఎలా ప్రూవ్ చేసుకోగలిగాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఈ సినిమా సమ్మర్ కనుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాతో మేర్లపాక గాంధీ సూపర్ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక వరుణ్ తేజ్ సైతం డిఫరెంట్ సినిమాలను చేస్తూ వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నప్పటికి అతనికి ఈ మధ్యకాలంలో సక్సెస్ అయితే రావడం లేదు. కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా అతనికి గొప్ప విజయాన్ని సాధించి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

