Ghani Ticket Rates: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనుండగా.. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయా ? రావా ? అని చిత్రబృందం టెన్షన్ లో ఉంది.

అందుకే తమ సినిమా టికెట్ ధరలను తగ్గించండి మహాప్రభో అంటూ గని టీమ్ ప్రభుత్వానికి మొర పెట్టుకుంది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా తెలుగు సినిమా టికెట్ ధరలు తగ్గాయి. కానీ, ఆర్ఆర్ఆర్ టికెట్ ధరలను పెంచడంతో అన్నీ సినిమాల టికెట్ రేట్లు పెరిగాయి. మరోపక్క అధిక టికెట్ ధరల కారణంగా జనం థియేటర్స్ కు రావడం లేదు.
గని లాంటి చిన్న సినిమాలకు ఇది చాలా నష్టం. అందుకే.. మల్టీప్లెక్స్ లతో పాటు సింగిల్ స్క్రీన్ లకు సంబంధించి కూడా టికెట్ రేట్లును తగ్గించారు. సినిమా టికెట్ ధరలను తగ్గించామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనుంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే.. సాధారణ ఫ్యామిలీస్ సినిమా కోసం థియేటర్ కు వెళ్ళడం లేదు. అదే టికెట్ ధరలు తగ్గితే.. జనం ఎక్కువమంది సినిమాని చూస్తారు.
మరి ప్రస్తుతం టికెట్ ధరలు తగ్గించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
మల్టీప్లెక్స్‌లు: GST తో కలిపి రూ.200 /-
సింగిల్ స్క్రీన్‌లు: GSTతో కలిపి రూ.150 /-
Also Read: “ఎత్తర జెండా” పాటలో ఈ జెండా ని గమనించారా? ఆ జెండా నే ఎందుకు పెట్టారు ? దాని చరిత్ర ఏంటంటే ?
కాగా సవరించిన ఈ రేట్లతో గని బాక్సాఫీస్ వద్ద భారీ ప్రదర్శనకు సిద్ధం అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు.
అయితే ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో నటించడానికి వరుణ్ తేజ్ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా గనితో హిట్ కొడతాడేమో చూడాలి.
Also Read: ఎన్టీఆర్ జీవో దెబ్బకు అందరూ బస్సులు వేసుకొచ్చి.. !
[…] […]