Varun Tej Ghani Movie Release Date: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 24,2021న రిలీజ్ చేయాలనుకోగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని చెప్పగా, భీమ్లానాయక్ వల్ల పోస్ట్‌పోన్ అయింది. తాజాగా ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుందని ప్రకటించారు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ సందడి చేయనుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో సిజ్లింగ్ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో వరుణ్ తేజ్ తో కలిసి రొమాన్స్ చేసింది ఈ ముదురు బ్యూటీ.
Also Read: వర్మ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన విజయలక్ష్మి
మొత్తానికి తమన్నా ఈ సాంగ్ లో నటించడంతో గని సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో ఫైట్ చేయబోతున్నాడు. వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో నటించడానికి వరుణ్‌తేజ్ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది.
వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు. మరి గనితో వరుణ్ తేజ్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి. ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మొదటిసారిగా నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సినిమా అవుట్ ఫుట్ బాగానే వచ్చింది అని టాక్ ఉంది.
Also Read: ముమైత్ ఖాన్ యాక్షన్.. శ్రీరాపాక రియాక్షన్