Dulquer Salmaan- Naga Chaitanya: నాగచైతన్య – దుల్కర్ సల్మాన్ చిన్న తనం నుంచే మంచి స్నేహితులు అట. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారట. అయితే, తాజాగా చైతు తమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను, దుల్కర్ సల్మాన్ చదువుకునేటప్పుడు సినిమాల గురించి తప్ప అన్నింటి గురించి మాట్లాడుకునే వాళ్లమని నాగచైతన్య తెలిపాడు. మేం నటులమవుతామని అస్సలు ఊహించలేదన్నాడు.
గురువారం విడుదల కానున్న సినిమా ‘హే సినామిక’. కాగా చైతు తన ఫ్రెండ్ దుల్కర్ కోసం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చైతు మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించాడు. దుల్కర్, అదితిరావు, కాజల్ ప్రధాన పాత్రల్లో బృంద మాస్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘హేయ్ సినామికా’ ట్రైలర్ ను ప్రిన్స్ మహేశ్ బాబు లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పై నిక్ పౌల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ సినిమా ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది కూడా. అందుకే.. ఈ సినిమా విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని చిత్రయూనిట్ తెలిపింది. బృందగోపాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో దుల్కర్ సరసన కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరీ నటించారు.
కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ది వెరీ డిఫరెంట్ పాత్ర అని తెలుస్తోంది. అలాగే అదితీరావు హైదరీ కూడా తనకు భిన్నమైన పాత్రలో నటిస్తోందట. ఇక ఈ సినిమాకి గోపీ వసంత్ సంగీతం అందించాడు.
మలయాళ ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ స్టార్ హీరో కాబట్టి.. అక్కడ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక అదితిరావు హైదరీ వల్ల ఈ సినిమాకి హిందీలో కూడా మార్కెట్ కానుంది.
Also Read: హౌస్‌లో హంగామా సృష్టిస్టున్న ముమైత్.. ఛాలెంజర్స్ టీమ్‌తో పెద్ద గొడవ