https://oktelugu.com/

Varun Tej: వరుణ్ తేజ్ బ్యాచ్ లర్ పార్టీలో రచ్చరంబోలా.. ఎవరొచ్చారు? ఏం చేశారో తెలుసా?

వరుణ్ తేజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వీళ్ళ ప్రేమ గురించి చెప్తూ ఏడేనిమిది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న విషయం కూడా చెప్పాడు.

Written By:
  • Gopi
  • , Updated On : October 2, 2023 / 02:46 PM IST
    Follow us on

    Varun Tej: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో మెగా ప్రిన్స్ గా పిలువబడుతున్న వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హీరోగా మంచి పేరును సంపాదించుకున్నాడు.ఆ సినిమా ఆవరేజ్ గా ఆడినప్పటికీ ఆయనకు మాత్రం హీరోగా మంచి పేరు వచ్చింది.ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక గత కొద్ది రోజుల క్రితమే వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి కి నిశ్చితార్థం అయిన విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కానప్పటికీ వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే రూమర్లు ఎప్పటినుంచో వస్తున్నాయి.

    అయినప్పటికీ ఎప్పటికప్పుడు వాళ్లు ఆ విషయాన్ని తోసి పుచ్చుతు వచ్చారు కానీ ఫైనల్ గా అందరికీ ట్విస్ట్ ఇస్తూ ఇద్దరు వాళ్ళ ఇంట్లో పెద్దలను ఒప్పించి వాళ్ళ ఇష్టపూర్వకంగానే నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వరుణ్ తేజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వీళ్ళ ప్రేమ గురించి చెప్తూ ఏడేనిమిది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న విషయం కూడా చెప్పాడు. మొదటగా మిస్టర్ సినిమా షూటింగ్ లోనే లావణ్య పరిచయమైందని ఆ సినిమా షూటింగ్ లోనే వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు నచ్చి మంచి ఫ్రెండ్స్ గా మారారని,దాంతో కొద్ది రోజులు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉండి ఆ తర్వాత రిలేషన్ లో ఉండి ఆ తర్వాత ఒకరి అభిప్రాయాలను ఒకరు అంగీకరించి వాళ్ల ప్రేమని నిశ్చితార్థం దాకా తీసుకొచ్చారు అని చెప్పాడు…

    అయితే వీళ్ల ప్రేమ వ్యవహారం మీద వరుణ్ తేజ్ స్పందిస్తూ మొదటగా తనే లావణ్య కి లవ్ ప్రపోజ్ చేసినట్టుగా కూడా చెప్పాడు. అలాగే తనకు లావణ్య ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు గా కూడా తెలియజేశాడు. ఇక నిశ్చితార్థం తర్వాత రీసెంట్ గా వరుణ్ తేజ్ తన ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్ పార్టీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. తనకు అత్యంత క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ అయినా 40 మందితో స్పెయిన్ లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పార్టీ కి మెగా హీరోలు అయిన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అలాగే అల్లు శిరీష్ లాంటి సినిమా హీరోలు కూడా ఈ పార్టీ లో పాల్గొన్నట్లు గా తెలుస్తుంది.ఇక మొత్తానికి వరుణ్ తేజ్ బ్యాచ్ లర్ పార్టీ సక్సెస్ ఫుల్ గా జరిగింది…

    ఇక ప్రస్తుతం ఆయన పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.ఇక ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ల పెళ్లి నవంబర్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది కరెక్ట్ గా డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ నవంబర్ లో మాత్రం వీళ్ల పెళ్లి పక్కాగా ఉంటుందని తెలుస్తుంది. ఇక పెళ్లి తర్వాత లావణ్య సినిమాల్లో నటిస్తుందా, లేదా అనేది తెలియదు. కానీ మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే సినిమాల్లో నటించదు ఒకవేళ మంచి పాత్రలు ఏమైనా దొరికితే చేస్తుంది ఏమో.. ఇక ఇప్పటికే వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి ఇరు ఫ్యామిలీ ల వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్లానింగ్స్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నాగబాబుకి కూడా వరుణ్ తేజ్ ఒకడే కొడుకు కాబట్టి ఆయన కూడా వరుణ్ తేజ్ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయాలని చూస్తున్నాడు…

    ఇక సినిమాల పరంగా వరుణ్ తేజ్ హీరోగా రీసెంట్ గా వచ్చిన గండీవా దారి అర్జున అనే సినిమా చేశాడు ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ నెక్స్ట్ మట్కా అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా మీద ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాకి డైరెక్టర్ గా కరుణ కుమార్ వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఏం సినిమా చేయాలనేది పెళ్లి తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని కొత్త సినిమా కమిట్ అవ్వాలి అని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…