https://oktelugu.com/

Varun Tej : పెళ్లి కి ముందే ఆ సీనియర్ హీరోయిన్ తో వరుణ్ తేజ్ డేటింగ్..? ఇదెక్కడి దారుణం!

. ఇందులో యాంకర్ అడుగుతూ మీరు డేటింగ్ చెయ్యాలి అనుకుంటే ఏ హీరోయిన్ తో చెయ్యడానికి కోరుకుంటారు ? అని అడిగిన ప్రశ్నకి వరుణ్ తేజ్ సమాధానం చెప్తూ 'చిన్నప్పటి నుండి నాకు రమ్య కృష్ణ గారంటే పిచ్చి.ఆమె నా మొదటి క్రష్, డేటింగ్ చేసే అవకాశం వస్తే ఆమెతోనే చేస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : June 15, 2023 / 05:01 PM IST
    Follow us on

    Varun Tej : గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్న జంట వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి. సుమారుగా 7 ఏళ్ళ నుండి ప్రేమించుకుంటున్న ఈ జంట ఈమధ్యనే నిశ్చితార్థం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారని సోషల్ మీడియా లో ఇంతలా ప్రచారం అవుతున్నా కూడా ఇద్దరు బహిరంగంగా ఓపెన్ అవ్వకుండా ఇన్ని రోజులు చాలా జాగ్రత్త పడ్డారు.

    కానీ సోషల్ మీడియా కారణం గా బయట పడిపోయింది.వీళ్ళిద్దరూ చాలా కాలం నుండి బంజారా హిల్స్ లో ఒక ప్రవేట్ గెస్ట్ హౌస్ లో డేటింగ్ చేస్తూ వచ్చారు. లావణ్య త్రిపాఠి మెగా కుటుంబం లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా కచ్చితంగా హాజరవుతూ ఉండేది. అలా ఎన్నో సార్లు ఫోటోల ద్వారా వీళ్ళ వ్యవహారం బయటపడింది. ఎట్టకేలకు వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు, ఈ నెలలో ఘనంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

    ఇదంతా పక్కన పెడితే వరుణ్ తేజ్ గత కొంతకాలం క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ క్వచ్చన్స్ కి టకాటకా సమాధానం చెప్పారు. ఇందులో యాంకర్ అడుగుతూ మీరు డేటింగ్ చెయ్యాలి అనుకుంటే ఏ హీరోయిన్ తో చెయ్యడానికి కోరుకుంటారు ? అని అడిగిన ప్రశ్నకి వరుణ్ తేజ్ సమాధానం చెప్తూ ‘చిన్నప్పటి నుండి నాకు రమ్య కృష్ణ గారంటే పిచ్చి.ఆమె నా మొదటి క్రష్, డేటింగ్ చేసే అవకాశం వస్తే ఆమెతోనే చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఈ మాట విని యాంకర్ ఒక్కసారిగా షాక్ అయ్యింది, ఇంతమంది కుర్ర హీరోయిన్స్ తో నటించిన వరుణ్ తేజ్, పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన రమ్య కృష్ణ పేరు చెప్పడేంటి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియా లో సర్క్యూలేట్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగినప్పటి నుండి ఈ జంటకి సంబంధించిన పాత విషయాలను తవ్వుతున్నారు ఫ్యాన్స్. ఆ తవ్వకాల్లో ఇవన్నీ బయటపడ్డాయి.