Photo Story : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌గా రాణించడం సులువైన విషయం కాదు. కొందరు రెండు మూడు భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ మెప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న హీరోయిన్లు.. తమ చిన్ననాటి ఫొటోలను షేర్‌చేసి ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ను సంతోషపెడుతున్నారు. తాజాగా కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అమ్మడు తెలుగుతోపాటు తమిళం, మళయాలంలోనూ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్..
ఈ హీరోయిన్ తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించింది. అయినా కుర్రాళ్ల కలల హీరోయిన్‌గా మారింది. మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది కృష్ణుడి గెటప్‌లో ముద్దుగా ఉన్న మళయాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో ప్రేమమ్ సినమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఈమెకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో ప్రేమమ్ సినిమాలో కూడా నటించింది అనుపమ పరమేశ్వరన్.
తెలుగు, తమిళం, మళయాలంలో సినిమాలు..
అనుపమ తెలుగుతోపాటు, తమిళం, మళయాలం భాషల్లో సినిమాలు చేస్తుంది. ఇటీవల వచ్చిన కార్తికేయ2 సినిమాతో అనుపమకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. ఆ సినిమా భారీ విజయం సాధించింది. అనుపమ తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కృష్ణుడి గెటప్‌లో ఉన్న తన చిన్ననాటి ఫొటో షేర్‌చేసింది. ఈ ఫొటో నెటిజన్లను, అనుపమ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్స్ కూడా పెడుతున్నారు. కొంతమంది బాగుందని పెడుతుంటే.. మరికొందరు అనుపమ చిన్నప్పటి నుంచి అంతే అని పేర్కొంటున్నారు