https://oktelugu.com/

Tamannaah Bhatia: జాకెట్ తీసేసి శృంగార సన్నివేశంలో తమన్నా… మరీ ఇలా తెగించిందేంటి?

తమన్నా జీ కర్దా ప్రమోషన్స్ లో తన రోల్ బోల్డ్ గా ఉంటుందనన్నారు. తన పాత్ర రూపొందించిన తీరు అద్భుతం, నాకు గౌరవం పెరిగిందన్నారు. ఆమె మాటల అర్థం ఆడియన్స్ కి ఇప్పుడు అర్థం అవుతుంది.

Written By: , Updated On : June 15, 2023 / 04:59 PM IST
Tamannaah Bhatia

Tamannaah Bhatia

Follow us on

Tamannaah Bhatia: ఇరవై ఏళ్ల కెరీర్లో తమన్నా బోల్డ్ సీన్స్ లో నటించింది లేదు. ఆమె కనీసం లిప్ కిస్ లకు కూడా దూరంగా ఉంది. స్కిన్ షో సైతం ఓ మేరకు చేసింది. మరీ మితిమీరిన సన్నివేశాల్లో నటించిందలేదు. బాహుబలి మూవీలో టాప్ లెస్ సన్నివేశంలో నటించినా రాజమౌళి వల్గారిటీ లేకుండా చూసుకున్నాడు. కాబట్టి దాన్ని పూర్తి స్థాయి శృంగార సన్నివేశం అని చెప్పలేము. పొట్టి బట్టలు ధరించినా తమన్నా కొన్ని హద్దులు పెట్టుకున్నారు. అవి క్రాస్ చేసిన దాఖలాలు లేవు.

అయితే తమన్నా అందరికీ సడన్ షాక్ ఇచ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ సిరీస్ జీ కర్దా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ఆమె పాత్ర తీరు చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఓ సన్నివేశంలో తమన్నా టాప్ లేకుండా శృంగార సన్నివేశం చేసింది. నటుడు ఆషిమ్ గులాటీతో పాటు బెడ్ రూమ్ సన్నివేశంలో రెచ్చిపోయింది. తమన్నా నుండి అసలు ఊహించని సన్నివేశం అది. ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతుంది. తమన్నా ఈ రేంజ్ లో తాగించారేందని వాపోతున్నారు.

తమన్నా జీ కర్దా ప్రమోషన్స్ లో తన రోల్ బోల్డ్ గా ఉంటుందనన్నారు. తన పాత్ర రూపొందించిన తీరు అద్భుతం, నాకు గౌరవం పెరిగిందన్నారు. ఆమె మాటల అర్థం ఆడియన్స్ కి ఇప్పుడు అర్థం అవుతుంది. జీ కర్దా సిరీస్ కి తమన్నా బోల్డ్ సీన్స్ మంచి ప్రచారం తెచ్చిపెట్టాయి. అలాగే నెట్ఫ్లిక్స్ లో జూన్ 29 నుండి లస్ట్ స్టోరీస్ 2 స్ట్రీమ్ కానుంది. తమన్నా ప్రధాన పాత్రల్లో ఒకటి చేశారు. లస్ట్ స్టోరీస్ లో సైతం తమన్నా విజయ్ వర్మతో బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం.

మరోవైపు రెండు బడా ప్రాజెక్ట్స్ తమన్నా చేతిలో ఉన్నాయి. చిరంజీవికి జంటగా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. అలాగే రజినీకాంత్ తో జైలర్ మూవీలో జతకడుతున్నారు. ఈ రెండు భారీ చిత్రాలు ఆగష్టు నెలలో ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానున్నాయి. స్టార్ హీరోయిన్ హోదా పోయినా తమన్నా ఇంకా పెద్ద పెద్ద ఆఫర్స్ పట్టేస్తుంది.