Homeఎంటర్టైన్మెంట్Baby John Movie Teaser: తేరి రీమేక్ బాబీ జాన్ టీజర్ రివ్యూ... వైలెన్స్ పీక్స్,...

Baby John Movie Teaser: తేరి రీమేక్ బాబీ జాన్ టీజర్ రివ్యూ… వైలెన్స్ పీక్స్, వరుణ్ ధావన్ దుమ్మురేపాడుగా!

Baby John Movie Teaser: బాలీవుడ్ హీరోలు మాస్ ధోరణికి అలవాటు పడుతున్నారు. గతంలో క్లాస్ అండ్ స్టైలిష్ చిత్రాలు చేసే వారు సౌత్ ఇండియా స్టైల్ ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ లో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు సంచలనాలు చేస్తున్న నేపథ్యంలో మన తరహా కథలు ఎంచుకుంటున్నారు. వరుణ్ ధావన్ నెక్స్ట్ మూవీ టైటిల్ బేబీ జాన్ గా నిర్ణయించారు. ఈ సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల చేశారు. బేబీ జాన్ విజయ్ హీరోగా నటించిన తేరి చిత్ర రీమేక్. 2016లో దర్శకుడు అట్లీ తేరి చిత్రాన్ని తెరకెక్కించాడు.

విజయ్ పోలీసుగా, ఓ పాప తండ్రిగా రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించి అలరించాడు. తేరి కథను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం అవుతుంది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ కి ముందే హిందీ రీమేక్ బేబీ జాన్ విడుదల కానుంది.

ఇక బేబీ జాన్ టీజర్ అదిరింది. ఒక నిమిషానికి పైగా ఉన్న టీజర్లో వరుణ్ ధావన్ మాస్ లుక్ ఆకట్టుకుంది. లుంగీ కట్టు, ఎదిగిన జుట్టులో వరుణ్ గత చిత్రాలకు భిన్నంగా కనిపించాడు. చూస్తుంటే బేబీ జాన్ లో వైలెన్స్ పాళ్ళు ఎక్కువగానే ఉండేలా ఉంది. గన్ ఫైరింగ్ తో వరుణ్ ధావన్ రచ్చ చేశాడు. మరొక విశేషం ఏమిటంటే… ఈ చిత్రంతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. కీర్తి సురేష్ తో పాటు వామిక గబ్బి మరొక హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక బేబీ జాన్ చిత్రానికి కాళేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాకీ ష్రాఫ్, రాజ్ పాల్ యాదవ్ కీలక రోల్స్ చేస్తున్నారు. టీజర్లో థమన్ బీజీఎం ఆకట్టుకుంది.మురాద్ ఖేతని, జ్యోతి దేష్పాండే నిర్మిస్తున్నారు. దర్శకుడు అట్లీ భార్య ప్రియా అట్లీ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. బేబీ జాన్ మూవీ సమ్మర్ కానుకగా మే 31న విడుదల కానుంది.
Baby John | Biggest Action Entertainer of 2024 | Varun Dhawan, Keerthy Suresh & Wamiqa Gabbi

Exit mobile version