Paytm Shares: గత కొంత కాలంలో Paytm పతనం గురించి తీవ్ర చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఆర్థిక లావాదేవీలు ఉండవన్న నేపథ్యంలో చాలా మంది దీనికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో నెలరోజులుగా పేటీఎం షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. అయితే తాజాగా మంగళవారం ఒక్కసారి పెరిగాయి. పేటీఎం పై వస్తున్న ఆరోపణలపై దాని ప్రతినిధులు కొందరు వినియోగదారులకు హామీ ఇవ్వడంతో పాటు ఫిబ్రవరి 29 తరువాత ఆర్థిక లావాదేవీలు ఆగకుండా చూసుకుంటామని చెప్పడంతో అప్ అయినట్లు స్టాక్ మార్కెట్లో చర్చ సాగుతోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Paytm షేర్లు సోమవారం ముగిసే నాటికి ఓపెన్ షేర్ ధర రూ.438.35 గా ఉంది. గరిష్టంగా రూ.438.7 ఉండగా, కనిష్టంగా రూ.438.35తో ముగిసింది. మంగళవారం స్టాక్ ధర రూ.445.8 కు పెరిగింది. ప్రస్తుతం ఫిబ్రవరి 6 ఉదయం 10.16 గంటల సమయం వరకు ఇది కొనసాగింది. వన్ 97 కమ్యూనికేషన్ ధర కనిష్టంగా రూ.395.5, గరిష్టంగా రూ.472.5కి పెరిగింది. అంటే సోమవారం కంటే మంగళవారం 17 శాతం మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది స్టాక్ మార్కెట్ నికర లాభంలో 7.45 శాతం మార్పు అని అంటున్నారు.
ప్రస్తతుం పేటీఎం మార్కెట్ విలువ రూ.27,838.75 కోట్లు గా ఉంది. ఇందులో 52 వారాల గరిష్టం రూ.998.3 కాగా.. 52 వారాల కనిష్టం 487.05గా నమోదైంది. వీటిలో బీఎస్ ఈ వాల్యూమ్ 1,144,595 కోట్లుగా తెలుస్తోంది. పేటీఎంలో ఖాతాదారులకు సంబంధించిన ఈ కేవైసీ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వహించిందని ఆరోపిస్తూ కొందరు ఆర్బీఐకి ఫిర్యాదు చేయగా ఫిబ్రవరి 29 నుంచి ఆర్థిక కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం షేర్లు కుప్పకూలాయి. అయితే మంగళవారం అప్ కావడంతో ఊరట నిచ్చినట్లయింది.