https://oktelugu.com/

‘వరుడు కావలెను’ ఎందుకు మళ్లీ రీషూట్ ?

యువ హీరో నాగశౌర్య రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకి సరైన హిట్ దక్కి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ జంటగా, లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న ‘వరుడు కావలెను’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన వీడియోలు, ఫొటోస్ ఆసక్తికరంగా అనిపించాయి. 2021 వేసవిలో రిలీజ్ అని మేకర్స్ అధికారకంగా ప్రకటించినా ఆ సమయానికి రావటం కష్టమని ఫిలిం నగర్లో టాక్. దానికి […]

Written By:
  • admin
  • , Updated On : February 7, 2021 / 10:00 AM IST
    Follow us on


    యువ హీరో నాగశౌర్య రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకి సరైన హిట్ దక్కి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ జంటగా, లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న ‘వరుడు కావలెను’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన వీడియోలు, ఫొటోస్ ఆసక్తికరంగా అనిపించాయి. 2021 వేసవిలో రిలీజ్ అని మేకర్స్ అధికారకంగా ప్రకటించినా ఆ సమయానికి రావటం కష్టమని ఫిలిం నగర్లో టాక్. దానికి కారణం కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారని వినిపిస్తుంది.

    Also Read: సలార్‌ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ !

    సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకముందే డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య చెప్పిన స్క్రిప్ట్ బాగున్నప్పటికీ నిర్మాత సంతృప్తి చెందక మరో ఇద్దరు రచయితలతో మార్పులు చేర్పులు చేయించి చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఇప్పుడు దాదాపుగా ముప్పావు శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక మరికొన్ని చేంజెస్ అనుకుంటున్నారని, ఈ మేరకు ఇప్పటికే తీసిన కొన్ని సీన్స్ రీషూట్ చేయబోతున్నారని సమాచారం. ఈ మార్పులు సినిమాకు చాలా ప్లస్ అవుతాయని అందుకే యూనిట్ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారని అనుకుంటున్నారు.

    Also Read: అల్లు అర్జున్ కారవాన్ ను ఢీకొట్టిన లారీ

    నిర్మాత చినబాబుకు ఈ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతోనే నాగశౌర్య గ్రాఫ్ ని పట్టించుకోకుండా కొంచెం ఎక్కువనే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియోలో నాగశౌర్య, రీతు వర్మ జంట ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష లాంటి నటీ నటులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్