https://oktelugu.com/

వర్మ జిమ్మిక్కులు.. జనాలకు తెలిసిపోయిందా?

శివ’ సినిమాతో రాంగోపాల్ వర్మ టాలీవుడ్లో సెన్సేషన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హర్రర్.. థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. కొన్నాళ్లు దెయ్యం సినిమాలకు కేరాఫ్ అడ్రసుగా రాంగోపాల్ వర్మ నిలిచాడు. మరికొద్దిరోజులు బూత్ కంటెంట్ లతో సినిమాలను తెరక్కించాడు. కొన్నిరోజులు టాలీవుడ్.. మరికొన్ని రోజులు బాలీవుడ్ అంటూ తిరిగాడు. Also Read: ‘రామాయణం’లో.. రాముడిగా మహేష్ రావణుడిగా ఎన్టీఆర్ ? అయితే బాలీవుడ్లో అతడి పప్పులు ఉడకకపోవడంతో మళ్లీ టాలీవుడ్ బాటపట్టిన సంగతి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 2:47 pm
    Follow us on

    శివ’ సినిమాతో రాంగోపాల్ వర్మ టాలీవుడ్లో సెన్సేషన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హర్రర్.. థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. కొన్నాళ్లు దెయ్యం సినిమాలకు కేరాఫ్ అడ్రసుగా రాంగోపాల్ వర్మ నిలిచాడు. మరికొద్దిరోజులు బూత్ కంటెంట్ లతో సినిమాలను తెరక్కించాడు. కొన్నిరోజులు టాలీవుడ్.. మరికొన్ని రోజులు బాలీవుడ్ అంటూ తిరిగాడు.

    Also Read: ‘రామాయణం’లో.. రాముడిగా మహేష్ రావణుడిగా ఎన్టీఆర్ ?

    అయితే బాలీవుడ్లో అతడి పప్పులు ఉడకకపోవడంతో మళ్లీ టాలీవుడ్ బాటపట్టిన సంగతి తెల్సిందే. టాలీవుడ్లో అతడు ప్రస్తుతం తెరెకెక్కించే సినిమాలన్నీ కూడా వివాదాస్పద అంశాలే. కాంట్రావర్సీలనే సినిమాలుగా మారుస్తూ ఫ్రీ పబ్లిసిటీతో క్యాష్ చేసుకోవడం వర్మకు అలవాటుగా మారింది. కరోనా సమయంలోనూ దర్శకులంతా ఇంటికే పరిమితమైతే రాంగోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో జోష్ చూపించాడు.

    ఇటీవలీ కాలంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు చూపించిన ట్రైలర్.. టీజర్ కు సినిమాలో ఉండే కంటెంట్ కు సంబంధం లేకుండా పోతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ట్రైలర్లో చూపించిదే సినిమాగా చూపించి డబ్బులు దండుకుంటున్నాడని ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో అతడి సినిమాలపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

    లాక్డౌన్ సమయంలో పే పర్ వ్యూ పేరిట సినిమాలను వర్మ రిలీజు చేసి కోట్లల్లో డబ్బులను దండుకున్నాడు. వర్మ నిర్మించిన ‘కరోనా వైరస్’..‘నగ్నం’..‘క్లైమాక్స్’ మూవీలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితేనేం వర్మకు మాత్రం కోట్లలో ఆదాయం సమకూరింది. కాంట్రవర్సీలతో సినిమాలుగా తెరకెక్కిస్తూ ఫ్రీగా వర్మ డబ్బులు దండుకుంటుండంపై ప్రజల్లోనూ అతడిపై వ్యతిరేకత వ్యక్తమవుతోన్నారు.

    Also Read: కూచిపూడి కళాకారిణి శోభానాయుడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది: చిరంజీవి

    ఇటీవల వర్మ తెరకెక్కించిన ‘పవర్ స్టార్’ సినిమా నుంచి అతడిని జనాలు పట్టించుకోవడం మానేసినట్లు కన్పిస్తోంది. తాజాగా వర్మ తెరకెక్కించిన ‘ఆర్జీవీ మిస్సింగ్’ను జనాలు పట్టించుకున్న పాపానా పోలేదు. అదేవిధంగా ‘మర్డర్’.. ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాలకు లీగల్ సమస్యలు వచ్చిపడ్డాయి. తాజాగా వర్మ తెరకెక్కించిన ‘డేంజరస్’ మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

    వర్మ జిమ్మిక్కులను అర్థం చేసుకున్న జనాలు అతడి సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని టాక్ విన్పిస్తోంది. దీంతో వర్మ పని అయిందనే వాదనలు విన్పిస్తోంది. వర్మ పని అయిపోయిందన్న ప్రతీసారి వర్మ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ సక్సస్ అవుతున్నాడు. ఈనేపథ్యంలో వర్మ ప్రేక్షకుల ముందుకు ఎలాంటి ఎత్తుగడతో ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.