పోలీసుల అదుపులోకి ప్రముఖ సినీ నటుడు..

  గుట్కా తరలింపు ఘటనలో ప్రముఖ సినీ నటుడు సచిన్‌జోషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై క్రిమినల్‌ సీనల్‌ కోడ్‌ 41 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. గత మార్చిలో హైదరాబాద్‌లో 80 గుట్కా బాక్సులను స్వాధీనం చేసుకోగా వాటిలో సచిన్‌ జోషి హస్తమున్నట్లు తెలిసిందని వారు పేర్కొన్నారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందన్నారు. ఇన్నిరోజులు దుబాయ్‌లో ఉన్న సచిన్‌ జోషి ఇండియాకు రాగానే ముంబైలోని శివాజి మహారాజ్‌ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నామన్నారు. […]

Written By: Suresh, Updated On : October 14, 2020 1:50 pm
Follow us on

 

గుట్కా తరలింపు ఘటనలో ప్రముఖ సినీ నటుడు సచిన్‌జోషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై క్రిమినల్‌ సీనల్‌ కోడ్‌ 41 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. గత మార్చిలో హైదరాబాద్‌లో 80 గుట్కా బాక్సులను స్వాధీనం చేసుకోగా వాటిలో సచిన్‌ జోషి హస్తమున్నట్లు తెలిసిందని వారు పేర్కొన్నారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందన్నారు. ఇన్నిరోజులు దుబాయ్‌లో ఉన్న సచిన్‌ జోషి ఇండియాకు రాగానే ముంబైలోని శివాజి మహారాజ్‌ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించి విచారిస్తామన్నారు.