Veera Simha Reddy- Varasudu Collections: సంక్రాంతి పండగ ముగిసింది..వారం రోజుల పాటు కిటకిటలాడిన థియేటర్స్ అన్నీ ఇప్పుడు చల్లబడ్డాయి..మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మినహా, మిగిలిన సంక్రాంతి సినిమాలన్నీ డల్ అయిపోయాయి..కలెక్షన్స్ అసలు రావడం లేదు..ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం పండుగ సెలవల్లో బాగానే ఆడింది..తొలివారం లోనే 70 కోట్ల రూపాయిల షేర్ కి దగ్గరగా వసూళ్లను రాబట్టి ‘అఖండ’ మూవీ కలెక్షన్స్ ని దాటేశాడు.

గత ఏడాది విడుదలైన ‘అఖండ’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే..ఈ సినిమా తర్వాత బాలయ్య తలరాత మారిపోయింది..అంతకు ముందు 30 కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ కూడా లేని బాలయ్య ఏకంగా 75 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసే రేంజ్ కి ఎదిగాడు..ఈ రేంజ్ తన మార్కెట్ ఎదుగుతుందని బహుశా బాలయ్య బాబు కూడా ఊహించి ఉండదు.
అయితే పండగ సెలవలు వరకు ఈ చిత్రం బాగానే నెట్టుకొచ్చింది కానీ, ఆ తర్వాత మాత్రం వసూళ్ల పరంగా బాగా డ్రాప్ అయిపోయింది..ప్రస్తుతం ఈ సినిమాకి ఎంత వసూళ్లు వస్తున్నాయంటే , రీసెంట్ గానే విడుదలైన తమిళ హీరో డబ్బింగ్ చిత్రం ‘వారసుడు’ కంటే తక్కువ ఆక్యుపెన్సీలు మరియు తక్కువ వసూళ్లను నమోదు చేసుకుంటున్నాయి..ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో అయితే ఈ సినిమాకంటే పాతిక రోజుల క్రితం విడుదలైన రవితేజ ‘ధమాకా’ చిత్రం కంటే తక్కువ వసూళ్లను నమోదు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం..మొత్తం హింసే ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది..కానీ బాలయ్య రేంజ్ కి ఈ వసూళ్లు చాలా ఎక్కువే అని చెప్తున్నారు విశ్లేషకులు..ఇక బాలయ్య తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడితో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా తో కచ్చితంగా బాలయ్య బాబు హాట్ట్రిక్ హిట్ కొడతాడని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.