Varanasi vs Avatar: సినిమా సినిమాకు తనలోని సృజనాత్మకత కి పదును చెప్తూ, మన తెలుగు సినిమా స్థాయి ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli). ఆయన విజన్, ఆయన టేకింగ్ కి ఏకంగా హాలీవుడ్ సైతం సెల్యూట్ చేసింది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు(Superstar Mahesh Babu) తో చేస్తున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం తో ఏకంగా ఆయన హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ పై కన్నేశాడు. తన సినిమాల్లో హీరో ని ఒక సూపర్ మ్యాన్ గా చూపించడం రాజమౌళి స్పెషాలిటీ. అందుకే ఆయనతో సినిమా చేసిన ప్రతీ హీరో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తో ఇప్పటి వరకు తన సినిమాల్లో ఎప్పుడూ చేయని ప్రయోగం చేయబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ‘వారణాసి’ చిత్రం లో మహేష్ బాబు శ్రీ రాముడి క్యారక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు అనేది మనకి తెలిసిన విషయమే.
#Globetrotter ఈవెంట్ లో స్వయంగా రాజమౌళి ఈ విషయాన్నీ తెలియజేశాడు. అయితే ఇందులో మహేష్ కేవలం రెండు పాత్రలతో సరిపెట్టడం లేదట, ఏకంగా 5 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. అంతే కాకుండా ఈ సినిమా కోసం అడ్వాన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ని ఉపయోహించబోతున్నారట. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలకు కూడా ఉపయోగించని టెక్నాలజీ ని ఈ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారట. అవతార్ రెండు భాగాలకు కూడా ఈ టెక్నాలజీ ని ఉపయోగించలేదట. గ్రాఫిక్స్ క్వాలిటీ , పిక్చర్ క్వాలిటీ వెండితెర మీద ప్రతీ చిన్న డీటెయిల్ కనిపించేలా, మనం స్వయంగా ఆ ప్రపంచం లోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తుందట.
వచ్చే ఏడాది మే లోపు ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అవుతుందని సమాచారం. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్ కోసం ఏడాది సమయం కేటాయించనున్నారట. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. వీళ్లిద్దరి పాత్రలు ఇచ్చే ట్విస్టులు సినిమాలో మామూలు రేంజ్ లో ఉండవట. కీరవాణి కూడా గూస్ బంప్స్ రప్పించే రేంజ్ మ్యూజిక్ ని అందించేందుకు తన వైపు నుండి ది బెస్ట్ వచ్చేలా పని చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘సంచారి’, ‘రణ కుంభ’ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి ఇంకా ఎలాంటి కంటెంట్ రాబోతుంది అనేది.