Harish Rao Hair Transplant: హరీశ్‌రావు.. బీఆర్‌ఎస్ నేత.. తెలంగాణ మాజీ మంత్రి. అధికారంలో ఉన్నా.. లేకపోయినా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యాయత్నం చేసి.. ఉద్యమం ఎగసిపడేలా చేశారు. అయితే ఆయన ఆత్మహత్యాయత్నం కారణంగా చాలా మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణ వచ్చాక.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగా, ఆయన పాలకవర్గంలో కేసీఆర్ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సిద్దిపేట రూపురేఖలు పూర్తిగా మార్చిన హరీశ్ ప్రతీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నారు. 2023లో బీఆర్‌ఎస్ ఓడిపోయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే హరీశ్‌రావు తండ్రి చనిపోయారు. ఆ సమయంలో గుండో కనిపించిన హరీశ్‌రావు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నారు. కొత్తగా కనిపిస్తున్నారు.
ముసలితనానికి గుడ్‌బై..
బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇటీవల హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని కొత్త రూపంతో కనిపించారు. ముందు ముసలితనంతో ఆకర్షణ క్షీణించిన ఆయన ఇప్పుడు దట్టమైన జుట్టుతో యంగ్ లుక్ సాధించారు. ఈ మార్పు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తమై, అభిమానులు, విమర్శకులు లైక్‌లు, కామెంట్లతో హడావిడి చేస్తున్నారు.
వైరల్ వీడియోలు, ఫోటోలు..
హైదరాబాద్‌లోని ప్రముఖ క్లినిక్‌లో జరిగిన ఈ ప్రొసీజర్ తర్వాత హరీష్ రావు పబ్లిక్ మీటింగ్‌లు, పార్టీ కార్యక్రమాల్లో కనిపించగానే ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు ‘యంగ్ హరీశ్‘ అంటూ ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు ‘పొలిటిక్స్ కోసం ఇమేజ్ మేకోవర్‘ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ మార్పు రాజకీయ ఇమేజ్‌ను బలోపేతం చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరి కొందరూ హరీశ్ ముసలోడవకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల మధ్య హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ట్రెండ్ పెరుగుతోంది. హరీశ్‌రావు కూడా ఈ లైన్‌లో చేరి, ఆధునిక టెక్నాలజీతో జుట్టు మార్పును స్వీకరించారు. ఈ చిన్న మార్పు ఆయన పబ్లిక్ అప్పీరెన్స్‌ను మెరుగుపరిచి, రాజకీయ జర్నీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది.
Big Breaking News ..
Hair Transplantation చేసుకున్న హరీష్ రావు!
ముసలితనం లో సోకులు పడుతున్న Harish ..
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) December 9, 2025