Homeఎంటర్టైన్మెంట్Kriti Sanon: 'హగ్' కావాలంటూ నడిరోడ్డు మీద నిల్చొని బ్రతిమిలాడుతున్న హాట్ హీరోయిన్.. వీడియో వైరల్..

Kriti Sanon: ‘హగ్’ కావాలంటూ నడిరోడ్డు మీద నిల్చొని బ్రతిమిలాడుతున్న హాట్ హీరోయిన్.. వీడియో వైరల్..

Kriti Sanon: సోషల్ మీడియా లో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉండే టాప్ హీరోయిన్స్ లో ఒకరు కృతి సనన్. ఈమెకు యూత్ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ సాధారమైనది కాదు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ , తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. ఈమె మన టాలీవుడ్ లో విడుదలైన ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారానే వెండితెర అరంగేట్రం చేసింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కాకుండా , నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ, ఏకంగా నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకునే స్థాయికి ఎదిగింది. ఆమె నటించిన ‘కాక్ టైల్ 2’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది.

ఇందులో షాహిద్ కపూర్, రష్మిక మందాన హీరో హీరోయిన్లు గా నటించగా, కృతి సనన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించింది. ఈ సినిమా నేడు విడుదలైన మొదటి ఆట నుండి కృతి సనన్ పోషించిన క్యారెక్టర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ రేంజ్ లో ఆమె ఈ క్యారెక్టర్ లో జీవించింది. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే , అందుకు కారణం కృతి సనన్ అద్భుతమైన నటన వల్లే అని అంటున్నారు నెటిజెన్స్. ఈ సినిమా ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో , ఈ మూవీ టీం చేసిన హంగామా మామూలుది కాదు. బాలీవుడ్ లోనే వీళ్ళ ప్రమోషన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిల్చింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయం లో కృతి సనన్ తీసుకున్న ఒక క్యూట్ వీడియో ని కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

ఈ వీడియో లో ఆమె ‘నీడ్ ఏ హాగ్’ అంటూ ఒక బోర్డు పట్టుకొని నడిరోడ్డు మీద నిలబడడం , ఆ తర్వాత వెంటనే డైరెక్టర్ వెనక్కి వచ్చి ఆమెని హాగ్ చేసుకోవడం వంటివి చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించింది. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ టైం లో తనకు ఎదురైనా అద్భుతమైన అనుభవాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆడియన్స్ తో పంచుకుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియోలను , ఫోటోలను మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version