Varanasi Movie Leaked Scenes: రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రెస్టేజీయస్ గా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ గ్లింప్స్ లోనే సినిమా యొక్క థీమ్ ఏంటి అనేది పరిచయం చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక విజువల్ వండర్ గా తెరకెక్కబోతుందనే విషయాన్నైతే రాజమౌళి చాలా క్లారిటిగా చెప్పాడు… ఇక ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన మూడు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఈ మూడు షెడ్యూల్స్ లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
ఇప్పుడు ఆ సన్నివేశాలు కొన్ని లీక్ అయ్యాయి అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఆ సీన్స్ ఎడిటింగ్ రూమ్ నుంచి లీకయ్యాయా లేదంటే ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ దగ్గర నుంచి లీక్ అయ్యాయా అనే విషయం మీద రాజమౌళి ఆరాధిస్తున్నాడు.
ప్రస్తుతం ఆ వీడియో నెట్ లో ఎక్కడ లేకుండా డిలీట్ చేశారట. ఎందుకని రాజమౌళి ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి లీకైతుంది. కావాలనే సినిమా యూనిట్ లీక్ చేస్తున్నారా? లేదంటే ఎవరైనా లీక్ చేస్తున్నారా అనేది అర్థం కానీ పరిస్థితి… నిజానికైతే రాజమౌళి మాత్రం సినిమా మీద భారీ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో కొన్ని సీన్స్ లీక్ అవ్వడం వల్ల వాళ్ల కాన్ఫిడెన్స్ దెబ్బ తినే అవకాశమైతే ఉంది.
కానీ రాజమౌళి మాత్రం ఈ విషయాలను పట్టించుకోకుండా తన వర్క్ తాను చేసుకుంటూ ఇంకా స్ట్రీక్ రూల్స్ ను పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది… మరి ఈ విషయం మీద రాజమౌళిగానీ, వాళ్ల టీం గానీ ఎవరు స్పందించలేదు. నిజంగానే సీన్ లీక్ అయిందా? కావాలనే సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది…