Varanasi movie set cost: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేస్తుందని అందరు నమ్ముతున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. మహేష్ బాబు ఈ సినిమాలో ఐదు గెటప్ ల్లో నటిస్తున్నాడు అంటూ రాజమౌళి హింట్ అయితే ఇచ్చాడు. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో పురాణాలను బేస్ చేసుకుని టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా అయితే ఉండబోతుందట. మొత్తానికైతే ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…అయితే ఈ సినిమా కోసం కొత్తగా ఒక సెట్ అయితే వేశారట.
హైదరాబాద్ శివార్లలో వేసిన ఈ సెట్టు కోసం దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. అంత పెద్ద మొత్తంలో సెట్ ఎందుకు వేస్తున్నారంటే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఇంత భారీ బడ్జెట్ తో సెట్ చేయడం అనేది మామూలు విషయం కాదు.
ఇదంతా చూసిన కొంతమంది ప్రేక్షకులు సైతం ‘వారణాసి’ సినిమాకి ఒక్క సెట్ కి అయ్యే ఖర్చు తో 10 చిన్న సినిమాలను తీయొచ్చు అంటూ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం బిజినెస్ లేకపోతే ఆ గ్రాండియర్ అనేది కనిపించదు. కాబట్టి ఇప్పటికి డబ్బులను ఖర్చుపెట్టి మరి ఆ సినిమాకు భారీ వసూళ్లను రాబట్టే ప్రయత్నం చేస్తుంటాడు…
ఇక అందులో భాగంగానే ఈ సినిమా కోసం భారీ సెట్ వేసినట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే రాజమౌళి ఎవ్వరు ఊహించని రేంజ్ లో వారణాసి సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం… భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీసి అంతకు మించిన వసూళ్లను రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
