Varanasi Latest Update: సక్సెస్ ఫుల్ సినిమాలను తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్న ఈ దర్శకుడిని అభినందించని వారు ఉండరు. రాజమౌళి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా తన సత్తాను చాటుకున్నాడు. ఇప్పటివరకు తనని బీట్ చేసే దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం. ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు… ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైం ట్రావెల్ కి సంబంధించిన సినిమాగా తెలుస్తోంది. అందులో పురాణాలను కూడా యాడ్ చేసి మనకు చూపించబోతున్నారు.
ఈ సినిమాలో పురాణాలకు సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండబోతున్నాయట. అవి కనక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు మాత్రం కొంతమందే ఉంటారు… రాజమౌళి చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతోంది. ఎందుకంటే ఆయన సినిమా కోసం తన ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడు. ప్రతిక్షణం సినిమా కోసం ఆలోచిస్తాడు. అందులో ఏ అంశాలు ఉంటే బాగుంటాయి, ఏ అంశాలు లేకపోతే సినిమా ఇంకా ఎలివేట్ అవుతుంది అనే విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు.
అందుకే అతని సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన ఉంది. ఇక తన షాట్ మేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ తను చేసి చూపించి నటుల చేత నటింపజేస్తాడు. కాబట్టి అతను అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది… ఆయన అంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు. కాబట్టే అతనికి సక్సెస్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి…