Pawan Kalyan: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన నటుడు పవన్ కళ్యాణ్… వరుసగా 7 విజయాలతో తన స్టామినా ఏంటో చూపించిన ఆయన ఆ తర్వాత కొన్ని ప్లాప్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి వాటిని ఎదుర్కొని నిలబడ్డాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో కంబ్యాక్ ఇచ్చిన ఇచ్చాడు. అప్పుడు ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లాయి. ఏపీ డిప్యూటీ సీఎ గాం తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్న సమయంలో అతనికి కొంతమంది హీరోల నుంచి తీవ్రమైన పోటీ అయితే ఎదురైంది. అందులో నవీన్ వడ్డే ఒకరు కావడం విశేషం…ఇక వడ్డే నవీన్ సైతం పవన్ కళ్యాణ్ లా స్టార్ హీరోగా ఎదుగుతాడు అని చాలామంది అనుకున్నారు. కానీ అతని స్టోరీ సెలక్షన్స్ లోపం ఉండటం వల్ల స్టార్ హీరోగా మారలేకపోయాడు…
ఇక అక్కినేని నాగేశ్వర రావు మనవడైన సుమంత్ సైతం పవన్ కళ్యాణ్ కి పోటీగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతను కూడా అనుకున్న విజయాలను సాధించలేకపోయాడు. ఆడపదడప సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సుమంత్ తో ఇప్పుడు స్టార్ డైరెక్టర్లెవరు భారీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
తనతో చాలా మంది చిన్న దర్శకులు సినిమాలను చేస్తున్నారు. ఈ సినిమాలతో సుమంత్ కొంతవరకు సక్సెస్ లను సాధించినప్పటికి తను అనుకున్న సక్సెస్ లు మాత్రం అతనికి దక్కడం లేదు…ఇలా వీళ్ళిద్దరూ ఒకానొక టైమ్ లో పవన్ కళ్యాణ్ లో పడి బోల్తా కొట్టారు..