Varanasi Actors Remuneration: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ పై ఫ్యాన్స్, ఆడియన్స్ లో అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ పెద్ద హిట్ అవ్వలేదని రాజమౌళి కాస్త అసంతృప్తి చెందినప్పటికీ, గ్లింప్స్ వీడియో మాత్రం ఆడియన్స్ కి అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అవ్వడం పై మూవీ టీం మొత్తం ఇప్పుడు సంతోషం గా ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఎక్కడ చూసినా ఈ గ్లింప్స్ వీడియో గురించే చర్చ. రకరకాల ఫన్నీ మీమ్స్ తో అదరగొట్టేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు నటిస్తున్న నటీనటులకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించడానికి దాదాపుగా 35 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది అట. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు మహేష్ బాబు తో సరిసమానమైన స్క్రీన్ స్పేస్ ఈమెకు ఉంటుందట. ఆయనతో సమానంగా సాహసాలు కూడా చూస్తుందట. అందుకే ఆమెకు ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు నిర్మాతలు. ఇక ఈ చిత్రం లో విలన్ గా నటిస్తున్న పృథ్వి రాజ్ సుకుమారన్ కి కేవలం 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే ఇస్తున్నారట. ఎందుకంటే ఆయన క్యారక్టర్ నిడివి ఈ చిత్రం లో చాలా తక్కువగా ఉంటుందని టాక్. ఇంట్రడక్షన్, ప్రీ ఇంటర్వెల్,ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు మాత్రమే ఆయన కనిపిస్తాడట. అందుకే కాస్త తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. వాస్తవానికి ఈ క్యారక్టర్ కోసం రాజమౌళి ముందుగా తమిళ స్టార్ హీరో విక్రమ్ ని సంప్రదించారట.
కానీ విక్రమ్ తన స్థాయికి తగ్గ క్యారక్టర్ కాదని సున్నితంగా రిజెక్ట్ చేసాడట. ఇకపోతే త్వరలోనే తమిళ్ హీరో మాధవన్ ఈ చిత్రం లో భాగం కానున్నాడు. ఇందులో ఆయన మహేష్ బాబు కి తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడట. ముందుగా ఈ పాత్ర కోసం అక్కినేని నాగార్జున ని అనుకున్నారు.కానీ ఎందుకో ఆయన కూడా ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం. అదే విధంగా రాజమౌళి ఈ సినిమాకు జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్ లో వాటాలు తీసుకుంటాడట. ఆయనకు వచ్చే వాటాల్లోనే కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, కాంచి, కార్తికేయ, రమా, వల్లి తదితరులు పంచుకుంటారట.