https://oktelugu.com/

Varalaxmi Sarathkumar : రెండు సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్… అవి ఏ సినిమాలంటే..?

.కానీ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నాకు నేను సంతృప్తిని పొందుతున్నాను అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతున్నాయి...

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2024 / 08:43 PM IST
    Follow us on

    Varalaxmi Sarathkumar : తన విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్.. తన తండ్రి అయిన శరత్ కుమార్ నటుడు కావడం వల్ల వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది. అయితే మొదట ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ హీరోయిన్ గా ఆమె పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ పాన్ ఇండియా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

    ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో లేడీ విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న వరలక్ష్మి ప్రస్తుతం స్టార్ నటిగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే చాలా మంచి సినిమాలను చేసి ఇండస్ట్రీలో ఎవరు పొందలేని గుర్తింపును పొందుతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె ‘ శబరి’ అనే సినిమాను చేసింది. అయితే ఈ సినిమా తొందరగా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో తను బిజీగా గడుపుతుంది.

    ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అయితే ఆమె ఇండస్ట్రీకి రాకముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని శరత్ కుమార్ పేరు తన బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నప్పటికీ తను ఆషామాషీగా హీరోయిన్ అవ్వలేదని చాలా ఆడిషన్స్ ఇచ్చి అందులో చాలా మందిని దాటుకొని హీరోయిన్ గా ముందుకు వచ్చనని ఈ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

    ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ డైరెక్షన్ లో వచ్చిన బాయ్స్, ప్రేమిస్తే సినిమాల్లో మొదట ఈమెనే హీరోయిన్ గా అడిగారట. కానీ అనుకోని కారణాల వల్ల తను ఆ సినిమాలను రిజెక్ట్ చేసిందట. ఇక ఇప్పుడు ఆ విషయాల గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఒకవేళ నేను హీరోయిన్ గా ఆ సినిమాలు చేసుంటే హీరోయిన్ గానే సెటిల్ అయిపోయేదాన్ని..కానీ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నాకు నేను సంతృప్తిని పొందుతున్నాను అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతున్నాయి…