https://oktelugu.com/

హీరోయిన్ మూడో భర్తకు మళ్లీ గుండెపోటు !

మాజీ హీరోయిన్ ‘వ‌నితా విజ‌య‌కుమార్‌’కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇటీవలె ఇండస్ట్రీకే చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుండి వనితపై బాగా ట్రోలింగ్ జరిగింది. చాలామంది నెటిజన్లు ఆమెను కావాలని టార్గెట్ చేశారు. అయినా కూడా ఆమె అందరికీ తనదైన శైలిలో సమాధానం చెబుతూ తన మూడో పెళ్లిని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆమె మూడో భర్త పీటర్ పాల్ ఆరోగ్యం బాగాలేదు. ఆయనకు చాతిలో విపరీతంగా నొప్పి […]

Written By:
  • admin
  • , Updated On : August 27, 2020 / 09:49 AM IST
    Follow us on

    మాజీ హీరోయిన్ ‘వ‌నితా విజ‌య‌కుమార్‌’కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇటీవలె ఇండస్ట్రీకే చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుండి వనితపై బాగా ట్రోలింగ్ జరిగింది. చాలామంది నెటిజన్లు ఆమెను కావాలని టార్గెట్ చేశారు. అయినా కూడా ఆమె అందరికీ తనదైన శైలిలో సమాధానం చెబుతూ తన మూడో పెళ్లిని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆమె మూడో భర్త పీటర్ పాల్ ఆరోగ్యం బాగాలేదు. ఆయనకు చాతిలో విపరీతంగా నొప్పి రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని.. ఈ మధ్య ఆయన పెళ్లి అయ్యాక కాస్త వేరే రకం మందులు వాడాడని.. దాంతో ఆయనకు ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది. రెండు వారాల క్రితమే ఆయనకు ఇలాంటి సమస్యనే వచ్చింది. అప్పుడు తగ్గిపోయి.. మళ్లీ ఇలా సడెన్ గా గుండె పోటు రావడం.. వనిత కుటుంబాన్ని కలవర పెడుతొంది. ఇక తన మూడో భర్త పెళ్లి అయినా నెలకే హాస్పిటల్ లో చేరడం పై స్పందించిన వనిత… సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తపరుస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

    Also Read: ప్రభాస్ పెళ్లి.. అందుకే చేసుకోవట్లేదట !

    ఏమైనా వనితకి మొదటి రెండు పెళ్లిళ్లు న‌చ్చ‌క విడాకుల బాట పట్టాక.. ఆ తరువాత ఒంటరిగా ఆమె చాలా నలిగిపోయిందట. మానసికంగా ఎంతో నిరుత్సాహానికి గురి అయిందట. ఆ సమయంలోనే ఆమెకు పీటర్ పరిచయం అయ్యాడు. అతను వనిత కోసం భార్య పిల్లలను వదిలిపెట్టి.. వ‌నితా ఒంటరితనాన్ని అలాగే ఆమె మానసిక బాధను అతను తీర్చాడు. దాంతో చాల నెలలు పీటర్ తో సహజీవినం చేసింది. అతనికి అవకాశాల పరంగా కూడా వనిత చొరవ తీసుకుంది. ఇక అంతా హ్యాపీనే అనుకుని ఆనందంగా పెళ్లి చేసుకుని.. సుఖంగా కాపురం చేసుకుందామని ఎన్నో ప్లాన్స్ చేసుకుంటే.. ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఆమె మూడో భర్త హాస్పిటల్ పాలవ్వడంతో వనిత కంగారు పడుతుంది.

    Also Read: ‘పుష్ప’ కోసం సుకుమార్ కాపీల గోల !

    పాపం వనిత మొదటి పెళ్లి నుండి నానా ఇబ్బందులు పడుతూనే ఉంది. తనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసే భర్త కోసం, ఆమె నిరంతరం బయటకు కనబడని యుద్ధం తనలో తానే చేస్తూనే వస్తోంది. ఇంత చేసి.. పెళ్లి చేసుకుంటే దేవుడు కూడా ఆమెకి సహకరించడం లేదు. దీనికి తోడు వనిత మీద చేస్తోన్న కామెంట్స్ కూడా ఆమెను తెగ బాధ పెడుతున్నాయి. నాకు టీనేజ్ లో ఉన్న పిల్లలు ఉన్న మాట నిజమే. అంతమాత్రన ఒంటరిగా ఉండిపోవలా.. నేను వయసులో ఉన్నాను, నాకు ఓ తోడు కావాలని ఉంటుంది. అందుకే మూడో పెళ్లి చేసుకున్నాను. నాకే కాదు, ఎవరినైనా ఒంటరితనం బాధ పెడితే.. తోడు కోసం ఆశ పడటంలో ఎలాంటి తప్పు లేదు అని సోషల్ మీడియాలో తన పై కామెంట్స్ చేస్తోన్న వారికి బదులుగా వనిత చెప్పుకొస్తుంది.