https://oktelugu.com/

మూడో పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్‌ హీరోయిన్‌!

చిత్ర పరిశ్రమలో నటీ నటుల లైఫ్ స్టైల్ విచిత్రంగా ఉంటుంది. క్రేజ్‌, స్టార్డమ్‌ ఉన్నప్పుడే ఆఫర్లు వస్తాయి. యాక్టర్లుగా స్క్రీన్ పై వాళ్ల లైఫ్‌స్పాన్‌ తక్కువే. వాళ్ల రిలేషన్‌షిప్స్‌ కూడా అంతే. ప్రేమ, పెళ్లి బంధాలు త్వరగా ముగుస్తుంటాయి. అందుకే చాలా మంది ఒకటి మించి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆ లిస్ట్‌లో ఇప్పటికే చేరిపోయిన నటి వనితా విజయకుమార్‌ మూడో పెళ్లింది రెడీ అయింది. తమిళ్‌ బిగ్‌బాస్‌ 3 ద్వారా క్రేజ్‌ తెచ్చుకున్న వనిత.. నటుడు విజయకుమార్, […]

Written By:
  • admin
  • , Updated On : June 18, 2020 / 11:11 AM IST
    Follow us on


    చిత్ర పరిశ్రమలో నటీ నటుల లైఫ్ స్టైల్ విచిత్రంగా ఉంటుంది. క్రేజ్‌, స్టార్డమ్‌ ఉన్నప్పుడే ఆఫర్లు వస్తాయి. యాక్టర్లుగా స్క్రీన్ పై వాళ్ల లైఫ్‌స్పాన్‌ తక్కువే. వాళ్ల రిలేషన్‌షిప్స్‌ కూడా అంతే. ప్రేమ, పెళ్లి బంధాలు త్వరగా ముగుస్తుంటాయి. అందుకే చాలా మంది ఒకటి మించి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆ లిస్ట్‌లో ఇప్పటికే చేరిపోయిన నటి వనితా విజయకుమార్‌ మూడో పెళ్లింది రెడీ అయింది. తమిళ్‌ బిగ్‌బాస్‌ 3 ద్వారా క్రేజ్‌ తెచ్చుకున్న వనిత.. నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు. 1995లో నటుడు విజయ్‌కు జంటగా ‘చంద్రలేఖ’ అనే తమిళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించింది. ఓ సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యహరించింది.

    తెలుగులో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన దేవి సినిమాలో న‌టించిన వనితా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో ఆకాశ్‌తో డైవర్స్‌ తీసుకుంది. ఆ తరువాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. కానీ, ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలువలేదు. ఇద్దరూ విడిపోయారు. జయదర్షన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌–3లో పాల్గొని వార్తలోకి వచ్చింది. తాజాగా ఆమె మూడో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పీటర్ పాల్‌ అనే వ్యక్తితో ఈ నెల 27న చెన్నైలోని తన ఇంటి వద్దే వివాహం జరగనున్నట్లు పెళ్లి పత్రిక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వెడ్డింగ్‌ కార్డ్‌ నిజమో కాదో వనిత, పీటర్ ధ్రువీకరించలేదు.