https://oktelugu.com/

సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం..

పాతతరం నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు అభిమాయ్ వెంకటేష్ కార్తీక్(36) హఠాన్మరణం చెందాడు. చెన్నైలోని తన నివాసంలో అభినయ్ శుక్రవారం రాత్రి తన కుమారుడితో సరదాగా గడిపిన వెంకటేష్ ఉదయానికల్లా మృతిచెందడం శోచనీయంగా మారింది. నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. ఆయన గుండెపోటుతో మృతిచెందారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది పోలీసులు విచారణ చేపడుతున్నారు. అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ అభినయ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 23, 2020 / 12:55 PM IST
    Follow us on


    పాతతరం నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు అభిమాయ్ వెంకటేష్ కార్తీక్(36) హఠాన్మరణం చెందాడు. చెన్నైలోని తన నివాసంలో అభినయ్ శుక్రవారం రాత్రి తన కుమారుడితో సరదాగా గడిపిన వెంకటేష్ ఉదయానికల్లా మృతిచెందడం శోచనీయంగా మారింది. నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. ఆయన గుండెపోటుతో మృతిచెందారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది పోలీసులు విచారణ చేపడుతున్నారు.

    అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ అభినయ్ వెంకటేశ్ మెడిసిన్ పూర్తి చేశాడు. ఆయన సతీమణి కూడా వైద్యురాలే. అభినయ్ ఊటీలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన ప్యాలెస్ పనులకోసం చెంగల్ పట్టు వెళ్లారని స్నేహితులు తెలిపారు. రాత్రి కుమారుడితో సరదాగా గడిపిన అభినయ్ తెల్లవారే సరికి విగతజీవిగా మారాడు. ఆయన మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో విషయం అందరికీ తెల్సిందే. అభియన్‌కు భార్య, ఓ కుమారుడు(4) ఉన్నాడు.

    వాణిశ్రీ 70, 80వ దశకంలో తెలుగు చిత్ర సీమలో అగ్ర కథానాయికగా కొనసాగారు. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ వాణిశ్రీ నటించారు. వాణిశ్రీ ఓ ఫ్యామిలీ వైద్యుడిని వివాహం చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అత్త, తల్లి క్యారెక్టర్లో నటించారు. వాణిశ్రీకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అభినయ్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అభినయ్ మృతితో టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. వాణిశ్రీ కుటుంబానికి పలువురు సెలబ్రెటీలు సానుభూతి వ్యక్తం చేశారు.