https://oktelugu.com/

ప్చ్.. సినిమాలే కాదు, టీజర్లూ వాయిదానే!

తమిళ హీరోలలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సాధించిన ఘనత ఒక్క ‘అజిత్’కే దక్కుతుంది. నిజానికి అజిత్ సినిమాల కోసం ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా తాజాగా అజిత్ నటిస్తున్న ‘వలిమై’ సినిమా అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఒకవిధంగా ఎదురుచూస్తున్నారు అనేకంటే, గత ఆర్నెళ్లుగా సినిమా అప్ డేట్ కోసం అతని అభిమానులు గోల గోల చేస్తున్నారు అనడం కరెక్ట్ ఏమో. అయితే, అభిమానుల ఎదురుచూపులను అర్ధం చేసుకున్న మేకర్స్, […]

Written By: , Updated On : April 24, 2021 / 08:50 AM IST
Follow us on

Ajithతమిళ హీరోలలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సాధించిన ఘనత ఒక్క ‘అజిత్’కే దక్కుతుంది. నిజానికి అజిత్ సినిమాల కోసం ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా తాజాగా అజిత్ నటిస్తున్న ‘వలిమై’ సినిమా అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఒకవిధంగా ఎదురుచూస్తున్నారు అనేకంటే, గత ఆర్నెళ్లుగా సినిమా అప్ డేట్ కోసం అతని అభిమానులు గోల గోల చేస్తున్నారు అనడం కరెక్ట్ ఏమో.

అయితే, అభిమానుల ఎదురుచూపులను అర్ధం చేసుకున్న మేకర్స్, మొత్తానికి అజిత్ పుట్టిన రోజు స్పెషల్ గా మే 1న ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ, ఇప్పుడు వాళ్ళకి కరోనా షాక్ ఇచ్చింది. దేశమంతా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని ఇప్పుడు ఫస్ట్ లుక్ వాయిదా వేశారని తెలుస్తోంది.

ఈ నిర్ణయం స్వయంగా అజిత్ నే తీసుకున్నాడని.. ప్రజలు బాధలో ఉన్నప్పుడు.. సినిమా ప్రమోషన్స్ ను చేయడం బాగోదు అని, అందుకే ఇప్పుడు సినిమా నుండి ఎలాంటి అప్ డేట్లు ఇవ్వొద్దు అని అజిత్ దర్శకనిర్మాతలకు సూచించాడట. మొత్తానికి కరోనా వల్ల సినిమా విడుదలలు వాయిదా పడడమే కాదు ఇప్పుడు ఏకంగా ఫస్ట్ లుక్, టీజర్లు కూడా పొస్టుపోన్ అవుతున్నాయి.

అన్నట్టు ఈ మే1న అజిత్ తన 50వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఈ పుట్టినరోజు నాడు తమ హీరో నుండి కొత్త అప్ డేట్ వినబోతున్నామని అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ రచ్చలో ముఖ్యమైనది అజిత్ రాజకీయ రంగ ప్రవేశం త్వరలో ఉండబోతుంది అంటూ రూమర్లను కూడా ప్రచారం చేస్తున్నారు.