https://oktelugu.com/

హిట్ టాక్ తెచ్చుకున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ తన పవర్ ఏంటో టాలీవుడ్ లో చూపించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా తన స్టామినా తగ్గడం లేదని నిరూపించారు. ‘వకీల్ సాబ్’ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యి అభిమానులకు పూనకం వచ్చేలా ఊపేస్తోంది. ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆశలను ‘వకీల్ సాబ్’ మూవీ నెరవేర్చిందనే చెప్పాలి. నిన్న అర్ధరాత్రి నుంచే యూఎస్ ప్రీమియస్ షోస్ ప్రదర్శన చేపట్టారు. నైజాంలో తెల్లవారుజామునుంచే వకీల్ సాబ్ సినిమా షోలు పడుతున్నాయి. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 9, 2021 / 08:46 AM IST
    Follow us on

    పవర్ స్టార్ తన పవర్ ఏంటో టాలీవుడ్ లో చూపించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా తన స్టామినా తగ్గడం లేదని నిరూపించారు. ‘వకీల్ సాబ్’ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యి అభిమానులకు పూనకం వచ్చేలా ఊపేస్తోంది. ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆశలను ‘వకీల్ సాబ్’ మూవీ నెరవేర్చిందనే చెప్పాలి.

    నిన్న అర్ధరాత్రి నుంచే యూఎస్ ప్రీమియస్ షోస్ ప్రదర్శన చేపట్టారు. నైజాంలో తెల్లవారుజామునుంచే వకీల్ సాబ్ సినిమా షోలు పడుతున్నాయి. దీంతో వకీల్ సాబ్ సినిమా టాక్ బయటకు వచ్చేసింది.

    వకీల్ సాబ్ చిత్రం చూసిన ప్రేక్షకులు ‘సూపర్ హిట్’ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కమ్ బ్యాక్ మూవీ అదిరిపోయిందంటున్నారు. వకీల్ సాబ్ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ చూసిన వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. లాయర్ గా పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూపించాడని అంటున్నారు.

    సామాజిక సమస్యకు కమర్షియల్ అంశాలు జోడించి చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ గొప్పగా తెరకెక్కించాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.

    కీలక రోల్స్ లో ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా, అనన్యల నటన అద్భుతం అని తెలుస్తోంది. థమన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. మొత్తంగా వకీల్ సాబ్ మూవీ సూపర్ హిట్ అని ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం పక్కా అంటున్నారు. పవన్ ఖాతాలో మరో విజయం వరించనుందన్నారు.

    హిందీ చిత్రం ‘పింక్’ రిమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. దిల్ రాజు-బోనీ కపూర్ నిర్మించారు. శృంతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈరోజు విడుదలైంది.