spot_img
Homeఎంటర్టైన్మెంట్Vakeel Subbu Singh: బిగ్‌ బాస్‌ తెలుగు సిజన్‌ 6లోకి వకీల్‌ సాబ్‌.. ఎవరీ 'సుబ్బు...

Vakeel Subbu Singh: బిగ్‌ బాస్‌ తెలుగు సిజన్‌ 6లోకి వకీల్‌ సాబ్‌.. ఎవరీ ‘సుబ్బు సింగ్ పోగు’ ?

Vakeel Subbu Singh: బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొట్టమొదటి సారిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఓ యంగ్ వకీల్‌ సాబ్‌ ఎంటర్‌ కానున్నాడా అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు న్యూస్‌ మీడియాతో పాటు, సోషల్‌ మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతోంది. ఖమ్మం జిల్లా వాసి, తెలంగాణ స్టేట్ హై కోర్ట్ అడ్వకేట్ సుబ్బు సింగ్ పోగుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.

Vakeel Subbu Singh
Vakeel Subbu Singh

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్ 6 జులై నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీజన్‌ 6లోకి సుబ్బు సింగ్‌కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అడ్వకేట్ అయిన సుబ్బు సోషల్ మీడియాలో సామాజిక అంశాలపైన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆయనకు పేదల అడ్వకేట్ అనే పేరు కూడా ఉంది. ఎంతో మంది పేదల తరపున వకాల్తా పుచ్చుకొని కొన్ని వందల కేసులను ఉచితంగా వాదించి విజయం సాధించారు.

Also Read: Ravi Teja Becomes Director: డైరెక్టర్ గా మారిన రవితేజ..తొలి సినిమా ఆ హీరో తో??

Vakeel Subbu Singh
Vakeel Subbu Singh

అంతే కాక, భర్తలు చనిపోయిన స్త్రీలకు, ఒంటరి మహిళలకు సంబంధించిన కొన్ని వందల కేసులను ఉచితంగా వాదించి వారికి అండగా నిలిచారు. సుబ్బు సింగ్‌ రంగస్థల నటుడిగా కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. వెండి తెరపై తన ప్రతిభను చాటుకునే పనిలో ఉన్నారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధార్థ గ్రామం కాగా గత కొంతకాలంగా హైదరాబాదులో నివాసముంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాద విద్యను పూర్తి చేసిన సుబ్బు త్వరలో విడుదల కానున్న ప్రధాన చిత్రాల్లో నటుడిగా చేశారు. అయితే న్యాయవాదిగా బిజీబిజీగా ఉండే సుబ్బు బిగ్ బాస్ హౌస్ కి వెళ్తారా? వెళ్ళరా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:Ram- Boyapati Movie: రామ్ – బోయపాటి మూవీ లో బాలయ్య బాబు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version