
జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో పవర్ స్టార్ బిజీ గా మారేరు . పవన్ కల్యాణ్ సినిమాలకు దూరం అవుతాడనుకున్న సమయంలో పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘వకీల్ సాబ్’ మూవీతో పవన్ కల్యాణ్ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈమేరకు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయినప్పటికీ నిత్యం ఏదో ఒక వార్తతో ‘వకీల్ సాబ్’ హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా ‘వకీల్ సాబ్’ కొత్త అవతారంతో వార్తల్లో నిలిచింది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మెగా ఫ్యాన్స్ ‘వకీల్ సాబ్’ పేరుతో ప్రింట్ చేసిన మాస్కులను పంచిపెడుతున్నారు.
వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!
మాస్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న పేదవారికి మెగా అభిమానులు నిత్యావసర సరుకులు, శానిటైజర్స్ పంచిపెడుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ పంచిపెట్టే మాస్కులపై ‘వకీల్ సాబ్’ పేరుతో ప్రింట్ ఉండటం గమనార్హం. అలాగే మరికొన్ని మాస్కులపై చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అనే పేరు కన్పిస్తోంది. పేదలకు మాస్కులను మంచిపెట్టడంపై మెగా ఫ్యాన్స్ ను పలువురు అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం మాస్కులపై ఇలా పేర్లతో ప్రచారం చేసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. అయితే మాస్కులు దొరకక ఇబ్బందులు పడ్డవారు మాత్రం తమకు ఉచితంగా మాస్కులను పంపిణీ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.