వంద కోట్ల సింహాస‌నంపై.. వ‌కీల్ సాబ్‌?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ ఏంట‌నేది అంద‌రికీ తెలిసిందే. దాన్ని మ‌రోసారి ఫ్రెష్ గా రుజువు చేసింది వ‌కీల్ సాబ్ చిత్రం. హై-ఓల్టేజ్ క్యూరియాసిటీతో విడుద‌లైన వ‌కీల్ సాబ్‌.. రికార్డుల విధ్వంసం కొన‌సాగిస్తూ దూసుకెళ్తోంది. తొలి రోజు ఓపెనింగ్స్ లో ఇండ‌స్ట్రీ రికార్డు క్రియేట్ చేసిన ప‌వ‌ర్ స్టార్‌.. ఇప్పుడు వంద కోట్ల సింహాస‌నంపై ఠీవీగా కూర్చోబోతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. నిజానికి వ‌కీల్ సాబ్ సినిమాకు ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మొద‌టిది ఈ సినిమా రీమేక్‌. […]

Written By: Bhaskar, Updated On : April 13, 2021 9:27 am
Follow us on

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ ఏంట‌నేది అంద‌రికీ తెలిసిందే. దాన్ని మ‌రోసారి ఫ్రెష్ గా రుజువు చేసింది వ‌కీల్ సాబ్ చిత్రం. హై-ఓల్టేజ్ క్యూరియాసిటీతో విడుద‌లైన వ‌కీల్ సాబ్‌.. రికార్డుల విధ్వంసం కొన‌సాగిస్తూ దూసుకెళ్తోంది. తొలి రోజు ఓపెనింగ్స్ లో ఇండ‌స్ట్రీ రికార్డు క్రియేట్ చేసిన ప‌వ‌ర్ స్టార్‌.. ఇప్పుడు వంద కోట్ల సింహాస‌నంపై ఠీవీగా కూర్చోబోతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

నిజానికి వ‌కీల్ సాబ్ సినిమాకు ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మొద‌టిది ఈ సినిమా రీమేక్‌. రెండోది లేడీ ఓరియంటెడ్ మూవీ. ప‌వ‌న్ డామినేష‌న్ చేసే సినిమా కాదు. అంతేకాదు.. పింక్ రీమేక్ ను క‌మ‌ర్షియ‌ల్ చేసేస్తున్నారంటూ నెగెటివ్ ట్రోల్స్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే సినిమా విడుద‌లైంది. విడుద‌లైన త‌ర్వాత కూడా ఇబ్బందులు కొన‌సాగాయి.

మూడో డ్రా బ్యాక్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బెనిఫిట్ షోల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. నాలుగోది.. టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఐదోది.. క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. ఇన్ని ప్ర‌తికూల అంశాల న‌డుమ కూడా వ‌కీల్ సాబ్ వ‌సూళ్ల సునామీ సృష్టిస్తుండ‌డం ట్రేడ్ పండితుల‌ను సైతం విస్మ‌య ప‌రుస్తోంది.

ఏప్రిల్ 9న థియేట‌ర్లోకి వ‌చ్చాడు వ‌కీల్ సాబ్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు రోజులు మాత్ర‌మే గ‌డిచాయి. కానీ.. ఇప్ప‌టికే ఈ చిత్రం దాదాపు 80 కోట్ల మేర గ్రాస్ సాధించిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. వ‌సూళ్లలో షేర్ కీల‌కం కాబ‌ట్టి.. అది కూడా హాఫ్ సెంచ‌రీ సాధించింద‌ని తెలుస్తోంది. క‌రెక్ట్ నంబ‌ర్స్ రావాల్సి ఉంది. కానీ.. 50 కోట్లు దాటిపోవ‌డం ప‌క్కాగా క‌నిపిస్తోంది.

ఇవాళ పండ‌గ సెల‌వు. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో వ‌కీల్ సాబ్ మిన‌హా.. మ‌రే చిత్ర‌మూ లేద‌నే చెప్పుకోవాలి. ఒక‌వేళ ఉన్నా.. లేన‌ట్టే. ఇక‌, వ‌చ్చే శుక్ర‌వారం రిలీజ్ కావాల్సిన ల‌వ్ స్టోరీ వెన‌క్కు వెళ్లిపోయింది. ఆ పైవ‌చ్చే వారం (23న‌) రావాల్సిన ట‌క్ జ‌గ‌దీష్ సంగ‌తేంట‌నేది ఇంకా తెలియ‌దు. కాబ‌ట్టి.. వ‌కీల్ సాబ్ కు ఎదురేలేదు.

థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీ పెట్టే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. తొలి వారంలో మాగ్జిమ‌మ్ ఫ్యాన్స్‌ సినిమాను క‌వ‌ర్ చేసి ఉంటారు. ఇక మిగిలింది సాధార‌ణ ప్రేక్ష‌కులు మాత్ర‌మే. అందులోనూ మ‌హిళా ప్రేక్ష‌కుల‌ను ఆద‌రించిన సినిమా కాబ‌ట్టి.. వారు థియేట‌ర్ కు వ‌చ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా.. చాలా థియేట‌ర్ల‌లో సినిమా ఆడుతోంది క‌నుక‌ 50 శాతం అనేది పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు.

ఈ విధమైన సానుకూల అంశాల‌తో.. లాంగ్ ర‌న్ లో వ‌కీల్ సాబ్ వంద కోట్ల షేర్ సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. వంద కోట్లు సాధించిన ప‌వ‌న్ తొలి చిత్రంగా వ‌కీల్ సాబ్ చ‌రిత్ర‌లో మిగిలిపోతుంది. ప‌వ‌ర్ స్టార్ జెండా ఇండస్ట్రీలో రెప‌రెప‌లాడుతుంది.