https://oktelugu.com/

ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు?

తెలుగువారు జరుపుకునే పండగలలో ఉగాది పండగ ఒకటనే సంగతి తెలిసిందే. ఉగాది పండుగ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. యుగాది అనే పదం నుంచి ఉగాది వచ్చింది. ఉగాది పండుగ రోజున ప్రజలు రాశిఫలాలతో పాటు గ్రహస్థితులను తెలుసుకుని గ్రహశాంతులు జరిపించుకోవచ్చు. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తే ఆ పనులు విజయవంతమవుతాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 13, 2021 / 09:01 AM IST
    Follow us on

    తెలుగువారు జరుపుకునే పండగలలో ఉగాది పండగ ఒకటనే సంగతి తెలిసిందే. ఉగాది పండుగ రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. యుగాది అనే పదం నుంచి ఉగాది వచ్చింది. ఉగాది పండుగ రోజున ప్రజలు రాశిఫలాలతో పాటు గ్రహస్థితులను తెలుసుకుని గ్రహశాంతులు జరిపించుకోవచ్చు. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తే ఆ పనులు విజయవంతమవుతాయి.

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి మొదటి నెల కాగా హిందువుల క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసాన్ని తొలి నెలగా పరిగణించడం జరుగుతుంది. మహారాష్ట్ర రాష్ట్రంలో గుడి పాడ్వా పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు.

    ఉగాది పండుగ రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ధ్వజారోహణ చేయాలి. ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినాలి. ఉగాది పచ్చడిని తినడం ద్వారా వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ పండుగ రోజున విష్ణు సహస్రం పఠించాలని నిత్యం విష్ణువునే ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది.

    ఈ సృష్టిలో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి కాబట్టి వేద పురోహితులు ఎంతో నిష్టతో పంచాంగ శ్రవణాన్ని పఠించడం జరుగుతుంది. మానవుని జీవితం కాలం పైనే ఆధారపడి ఉండగా మనం కాలపురుషుని ఉగాది రోజున ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. అందువల్ల ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే మంచిది.