సింగిల్ లవ్.. ఇంట్రస్టింగ్ పోస్టర్ లో ప్రభాస్ !

వింటేజ్ లవ్ స్టోరితో నేషనల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా నుండి తాజాగా ‘ఉగాది’ సందర్భంగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. మెనీ ఫెస్టివల్స్ సింగిల్ లవ్ అంటూ వచ్చిన ఈ పోస్టర్‌లో ప్రభాస్ లవర్ బాయ్ లుక్ లో కనిపిస్తున్నాడు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా […]

Written By: admin, Updated On : April 13, 2021 9:26 am
Follow us on

వింటేజ్ లవ్ స్టోరితో నేషనల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా నుండి తాజాగా ‘ఉగాది’ సందర్భంగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. మెనీ ఫెస్టివల్స్ సింగిల్ లవ్ అంటూ వచ్చిన ఈ పోస్టర్‌లో ప్రభాస్ లవర్ బాయ్ లుక్ లో కనిపిస్తున్నాడు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని.. అందుకే ప్రభాస్ లుక్ కూడా రెండు రకాలుగా ఉండటంతో పాటు హెవీ ఎమోషనల్ గా సాగుతోందని తెలుస్తోంది.


అయితే కాంబినేషన్ అనేది.. ఈ సినిమా మార్కెట్ కి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రాధాకృష్ణ కుమార్ గతంలో జిల్ అనే ప్లాప్ సినిమా చేశాడు. గోపీచంద్, రాశీ ఖన్నాలు హీరో హీరోయిన్స్‌గా వచ్చిన ఈ సినిమాలో ఏ మాత్రం మ్యాటర్ లేదని.. అలాంటి డైరెక్టర్ ను నమ్మి.. రూ. 140 కోట్ల బడ్జెట్ ‌తో సినిమాని ఎలా నిర్మిస్తున్నారు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా, ఈ సినిమాని నాలుగు భాషల్లో మార్కెట్ చేయాలంటే.. డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చాలా కీలకం అని మీకు తెలియదా ? అంటూ బయ్యర్లు ఈ సినిమా కోసం భారీ మొత్తం పెట్టడానికి ముందుకు రావడం లేదు.

ఒక విధంగా ఈ సినిమా లేట్ అవ్వాడనికి అది కూడా ఒక కారణం. అన్నిటికి మించి ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అందుకే ప్రభాస్ కూడా ఈ సినిమాకి మార్కెట్ అయ్యేవరకూ రిలీజ్ డేట్స్ మారుస్తూ మొత్తానికి ఇప్పటికే రెండుమూడు సార్లు పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కాబట్టి.. ముందుగా ప్రకటించినట్టు ఈ సినిమాని జూలై 30న రిలీజ్ చేయడం దాదాపు అసాధ్యమే. ఇక ఈ సినిమాకు తెలుగులో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. హిందీ వెర్షన్ కి వచ్చే సరికి ఈ సినిమాకు మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.